Redmi A7 Series Sale : రెడ్‌మి ఫ్యాన్స్ ఎగిరిగంతేసే ఆఫర్.. రెడ్‌మి A7 సిరీస్ ఫస్ట్ సేల్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?
Redmi A7 Series Sale : రెడ్‌మి A7, రెడ్‌మి A7 ప్రో సేల్ ప్రారంభమైంది. అద్భుతమైన ఫీచర్లతో ఈ రెండు ఫోన్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ధర కూడా మీ బడ్జెట్ ధరలోనే ఉంది. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.
- Sreehari A
- Published on- April 24, 2026 / 04:12 PM IST
Redmi A7 Series Sale
- రెడ్‌మి A7 ప్రో UNISOC T7250 12nm ప్రాసెసర్
- రెడ్‌మి A7 ప్రోలో 13ఎంపీ ప్రైమరీ కెమెరా ఆప్షన్
- 6.9-అంగుళాల HD+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
Redmi A7 Series Sale : రెడ్‌మి లవర్స్ కోసం అద్భుతమైన సేల్ ఆఫర్లు.. రెడ్‌మి A7, రెడ్‌మి A7 ప్రో ఫోన్లు భారత మార్కెట్లో అమ్మకానికి వచ్చాయి. ఈ రెండు షావోమీ స్మార్ట్‌ఫోన్‌లు ఆక్టా-కోర్ యూనిసాక్ T7250 12nm ప్రాసెసర్‌లతో రన్ అవుతాయి.
ఇందులో 13MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. రెడ్‌మి A7లో 5,200mAh బ్యాటరీ ఉండగా, రెడ్‌మి A7 ప్రోలో 6,300mAh బ్యాటరీ (Redmi A7 Series Sale) ఉంది. రెడ్‌మి A7, రెడ్‌మి A7 ప్రో ధర, ఆఫర్లు స్పెసిఫికేషన్లపై ఓసారి వివరంగా తెలుసుకుందాం..
రెడ్‌మి A7, రెడ్‌మి A7 ప్రో ధర ఎంతంటే? :
రెడ్‌మి A7 ఫోన్ 3GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499. రెడ్‌మి A7 ప్రో 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,499. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఈ రోజు నుంచి అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు షావోమీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
Read Also : Best Phones 2026 : రూ.35వేల లోపు ఏ ఫోన్ కొనాలి? మోటోరోలా, వివో, వన్‌ప్లస్ ఫోన్లలో ఏది బెటర్? ఫుల్ డిటెయిల్స్
రెడ్‌మి A7, రెడ్‌మి A7 ప్రో స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి A7లో 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే ఉంది. రెడ్‌మి A7 ప్రోలో 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.9-అంగుళాల HD+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆక్టా-కోర్ UNISOC T7250 12nm ప్రాసెసర్‌తో రన్ అవుతాయి. రెడ్‌మి A7 ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత షావోమీ హైపర్ఓఎస్ 2పై రన్ అవుతుంది. రెడ్‌మి A7 ప్రో ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ఓఎస్3పై రన్ అవుతుంది. సెక్యూరిటీ కోసం ఈ రెండు ఫోన్‌లలోనూ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
రెడ్‌మి A7, రెడ్‌మి A7 ప్రో రియర్ సైడ్ 13MP ప్రైమరీ కెమెరా ఎఫ్/2.2 అపర్చర్‌తో సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం, ఎఫ్/2.0 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లు IP52 రేటింగ్ అందిస్తాయి.
డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 5.2, GPS, యూఎస్‌బీ టైప్-C పోర్ట్ ఉన్నాయి. రెడ్‌మి A7లో 5200mAh బ్యాటరీ ఉండగా, రెడ్‌మి A7 ప్రోలో 6300mAh బ్యాటరీ ఉంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
