Redmi K100 Launch : గేమింగ్ ప్రియులకు పండగే.. 10,000mAh బ్యాటరీ.. 165Hz డిస్‌ప్లేతో కొత్త రెడ్‌మి K100 వస్తోంది..!
Redmi K100 Launch : రెడ్‌మి K100 అక్టోబర్ 27న చైనాలో లాంచ్ కానుంది. 6.83 అంగుళాల 165Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, 165fps గేమింగ్ సపోర్ట్ వంటి అంచనా ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- October 19, 2026 / 10:32 PM IST
Redmi K100 Launch
- గేమింగ్ కోసం 165fps సపోర్ట్‌తో కొత్త రెడ్‌మి ఫోన్
- 10,000mAh బ్యాటరీ, ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్
- అక్టోబర్ 27న రెడ్‌మి K100 ఎంట్రీ..
Redmi K100 Launch : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో పవర్‌ఫుల్ ఫోన్ సందడి చేసేందుకు రెడీ అవుతోంది. భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో రెడ్‌మి K100 ఫోన్ టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫోన్‌ను అక్టోబర్ 27న చైనాలో అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
165Hz డిస్‌ప్లే.. గేమింగ్‌కు కొత్త ఊపు :
రెడ్‌మి K100లో 6.83 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. 165Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు అందిస్తుంది. దీంతో స్క్రోలింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. 40కి పైగా గేమ్‌లలో 165fps గేమింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని రెడ్‌మి చెబుతోంది.
Read Also : Pension Alert 2026 : పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్ 30లోపు ఇదొక్కటి చేయండి.. లేదంటే పెన్షన్ పోయినట్టే..!
డిజైన్ విషయానికి వస్తే.. ఫ్లాట్ రియర్ ప్యానెల్, హారిజాంటల్ కెమెరా మాడ్యూల్‌తో ఈ ఫోన్ కనిపించనుంది. బ్యాక్ సైడ్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండగా, రైట్ సైడ్ సౌండ్ బై బోస్ అనే బ్రాండింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. మెటల్ మిడ్-ఫ్రేమ్, ఫ్లోరోసెంట్ గ్రీన్ కలర్ ఆప్షన్ కూడా ఈ ఫోన్‌లో ఉండనున్నాయి.
10,000mAh బ్యాటరీ.. 100W ఛార్జింగ్ :
ఈ ఫోన్‌లో 10,000mAh భారీ బ్యాటరీ ఉంటుందని అంచనా. అలాగే 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించనుంది. అదే నిజమైతే, లాంగ్ టైమ్ ఫోన్ వాడేవారికి అద్భుతంగా ఉంటుంది. సేఫ్టీ కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా అందించవచ్చని సమాచారం..
సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. రెడ్‌మి K100 ఆండ్రాయిడ్ 17 ఆధారిత షావోమీ హైపర్‌ఓఎస్ 4పై వర్క్ చేస్తున్నట్టు సమాచారం.. అయితే, బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ స్పీడ్ సహా కొన్ని కీలక స్పెసిఫికేషన్లు ఇంకా అధికారికంగా రివీల్ కాలేదు. ధర, పూర్తి ఫీచర్ల వివరాలు లాంచ్ సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. గేమింగ్, బ్యాటరీ బ్యాకప్ కోసం చూసేవారికి రెడ్‌మి K100 అద్భుతమైన ఆప్షన్.
