Redmi K100 Pro Series : చార్జింగ్ టెన్షన్‌కు ఇక బైబై! రెడ్‌మి నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. భారీ బ్యాటరీ, అదిరే ఫీచర్లు.. ధరలు ఇవే!
Redmi K100 Pro Series : రెడ్‌మి K100 ప్రో, రెడ్‌మి K100 ప్రో మ్యాక్స్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. రెడ్‌మి ఈ రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్లను పవర్‌ఫుల్ 200MP కెమెరాలు, ఆకట్టుకునే ఫీచర్లతో తీసుకొచ్చింది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..
- Sreehari A
- Published on- August 12, 2026 / 07:37 PM IST
Redmi K100 Pro Series
- భారీ బ్యాటరీలతో కొత్త రెడ్‌మి K100 సిరీస్ వచ్చేసింది
- 185Hz డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఎస్ఓసీ
- ఈ సిరీస్ ఫోన్లు రెడ్‌మి K90 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్
Redmi K100 Pro Series : కొత్త రెడ్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? రెడ్‌మి K100 ప్రో సిరీస్‌లో 2 ప్రీమియం ఫోన్లు వచ్చేశాయ్. ఈ ఫోన్‌లు 200MP కెమెరా, పవర్‌ఫుల్ 9070mAh బ్యాటరీ, క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌తో రన్ అవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ గత ఏడాదిలో వచ్చిన రెడ్‌మి K90 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్. ప్రస్తుతం రెడ్‌మి K100 ప్రో, రెడ్‌మి K100 ప్రో మాక్స్ అనే రెండు ఫోన్లను లాంచ్ చేసింది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
రెడ్‌మి K100 సిరీస్ ధర ఎంతంటే? :
రెడ్‌మి K100 ప్రో బేస్ 12GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర CNY 3,999 (సుమారుగా రూ. 57వేలు). అలాగే మూడు (Redmi K100 Pro Series) వేరియంట్లు 16GB ర్యామ్+ 256GB, 12GB ర్యామ్ + 512GB, 16GB ర్యామ్ + 512GB ధరలు వరుసగా CNY 4,399 (రూ. 62వేలు ), CNY 4,599 (రూ. 65వేలు), CNY 4,999 (రూ. 71వేలు) ధరకు లభించనున్నాయి. అదేవిధంగా, బ్లాక్, కాబెర్నెట్ సావిగ్నాన్, ఫైర్‌ఫ్లైస్ చేజింగ్ ది లైట్, వైట్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయొచ్చు.
- 12GB ర్యామ్ + 256GB : CNY 3999 (రూ. 57వేలు)
- 16GB ర్యామ్ + 256GB : CNY 4399 ( రూ. 62వేలు)
- 12GB ర్యామ్ + 512GB : CNY 4599 (రూ. 65వేలు)
- 16GB ర్యామ్ + 512GB : CNY 4999 (రూ. 71వేలు)
Read Also : TRAI New Rules : TRAI కొత్త రూల్స్.. 1601 నుంచి కాల్ వస్తే ఆన్సర్ చేయాలా? ఇదిగో ఫుల్ క్లారిటీ!
రెడ్‌మి K100 ప్రో మ్యాక్స్ బేస్ 12GB ర్యామ్+ 256GB వేరియంట్ ధర CNY 4,499 ( రూ. 64వేలు). మిగిలిన 4 వేరియంట్లు 16GB ర్యామ్ + 256GB, 12GB ర్యామ్ + 512GB, 16GB ర్యామ్ + 512GB, 16GB ర్యామ్ + 1TB ధరలు వరుసగా CNY 4,899 రూ. 69వేలు), CNY 5,099 (రూ. 72వేలు), CNY 5,499 (రూ. 78వేలు), CNY 5,999 (రూ. 85వేలు). బ్లాక్, కాబెర్నెట్ సావిగ్నాన్ రెడ్, చేజింగ్ ది విండ్ బ్లూ, ఫ్లోయింగ్ గోల్డ్ అండ్ వైట్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.
- 12GB ర్యామ్ + 256GB : CNY 4499 ( రూ. 64వేలు)
- 16GB ర్యామ్ + 256GB : CNY 4899 ( రూ. 69వేలు)
- 12GB ర్యామ్ + 512GB : CNY 5099 (రూ. 72వేలు)
- 16GB ర్యామ్ + 512GB : CNY 5099 (రూ. 72వేలు)
- 16GB ర్యామ్ + 1TB : CNY 5999 (రూ. 85వేలు)
రెడ్‌మి K100 ప్రో సిరీస్ ఫీచర్లు :
ఈ రెండు సరికొత్త రెడ్‌మి ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతాయి. ప్రో మోడల్‌లో 6.59-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ప్రో మాక్స్ మోడల్‌లో 6.59-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ రెండు ఫోన్‌లు 185Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తాయి.
రెడ్‌మి K100 ప్రో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 V చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ప్రో మాక్స్ మోడల్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంది. ఈ రెండు ఫోన్‌లు 16GB ర్యామ్‌తో వస్తాయి. ప్రో మోడల్ 512GB స్టోరేజ్ అందిస్తుండగా ప్రో మాక్స్ మోడల్ 1TB వరకు స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ రెండు ఫోన్‌లు ఏఐ ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ కొత్త రెడ్‌మి సిరీస్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OISతో 200MP మెయిన్ కెమెరా ఉంది.
అలాగే, రెడ్‌మి ప్రో మోడల్‌లో 50MP టెలిఫోటో, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. అదేవిధంగా రెడ్‌మి ప్రో మ్యాక్స్‌లో 50MP టెలిఫోటో, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ 2 రెడ్‌మి ఫోన్‌లలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. రెడ్‌మి K100 ప్రోలో 8,580mAh బ్యాటరీ ఉండగా, రెడ్‌మి K100 ప్రో మ్యాక్స్‌లో 9070mAh బ్యాటరీ ఉంది. ఈ రెండు ఫోన్‌లు 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.
