Redmi K100 Pro Series : రెడ్మి కొత్త ప్రో ఫోన్లు రాబోతున్నాయి.. ఈసారి రేంజ్ మామూలుగా ఉండదు బ్రో!
Redmi K100 Pro Series : రెడ్మి K100 ప్రో, రెడ్మి K100 ప్రో మ్యాక్స్‌లు అంతర్జాతీయ మార్కెట్లో పోకో F9 ప్రో, పోకో F9 అల్ట్రాగా లాంచ్ కానున్నాయి. పూర్తి ఫోన్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..
Redmi K100 Pro Series
- రెడ్మి K100 ప్రో సిరీస్‌లో 2 మోడళ్లు ఉంటాయి
- ఈ సిరీస్ స్టాండర్డ్ మోడల్ తర్వాత లాంచ్ కానుంది
- ఈ ప్రో సిరీస్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్
Redmi K100 Pro Series : కొత్త రెడ్మి ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకోసం అతి త్వరలో అద్భుతమైన ఫీచర్లతో కొత్త రెడ్మి ప్రో సిరీస్ రాబోతుంది. చైనాకు చెందిన ఈ ఫోన్ తయారీ కంపెనీ రెడ్మి K100 ప్రో సిరీస్ లాంచ్ చేయనుంది. ఇందులో మొత్తం రెండు మోడళ్లు ఉంటాయి. ఈ సిరీస్‌లోని స్టాండర్డ్ మోడల్‌ను తర్వాత లాంచ్ చేయనుంది. గత ఏడాదిలో షావోమీకి చెందిన ఈ సబ్-బ్రాండ్ రెడ్మి K90 సిరీస్‌ను లాంచ్ చేసింది.
రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఆగస్టు 11న చైనాలో లాంచ్ కానుందని రెడ్మి వెల్లడించింది. ఈ సిరీస్‌లో రెడ్మి K100 ప్రో, రెడ్మి K100 ప్రో మాక్స్ ఉంటాయి. ఆ తర్వాత కంపెనీ ఈ సిరీస్‌లోని స్టాండర్డ్ మోడల్‌ను లాంచ్ చేస్తోంది.
ఈ సిరీస్‌లో రెడ్మి K100 ఫోన్ ఫ్లాగ్షిప్-గ్రేడ్ కోరుకునే కస్టమర్ల కోసం తీసుకువస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రో మోడల్స్ తర్వాత లాంచ్ కానున్నాయి. రెడ్మి K100 ప్రో మ్యాక్స్ కాబెర్నెట్ రెడ్ కలర్ ఆప్షన్లలో అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అదే కలర్ సరిపోయే మెటల్ ఫ్రేమ్‌తో రానుంది.
స్పెషిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
రెడ్మి K100 ప్రో మ్యాక్స్‌లో 6.9-అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ సౌండ్ బై బోస్ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో రెడ్మి K100 ప్రో, రెడ్మి K100 ప్రో మ్యాక్స్‌లను పోకో F9 ప్రో, పోకో F9 అల్ట్రాగా లాంచ్ చేసే ఛాన్స్ ఉంది.
రెడ్మి K100 ప్రో సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను వాడొచ్చు. రాబోయే స్మార్ట్ఫోన్లు 185Hz రిఫ్రెష్ రేట్‌తో ఎల్టీపీఓ ఫ్లాట్ డిస్ప్లేతో రావొచ్చు. ఈ స్మార్ట్ఫోన్లు 200MP ప్రైమరీ కెమెరాతో ఉండవచ్చు. ఈ సిరీస్‌లోని స్టాండర్డ్ మోడల్ 8,500mAh బ్యాటరీ కూడా ఉండొచ్చు.
రెడ్మి K100 ప్రో మ్యాక్స్ 9,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లు 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయవచ్చు. రెడ్మి K100 ప్రో రియర్ కెమెరా యూనిట్ 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో రానుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ సిమెట్రికల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. సేఫ్టీ కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. రెడ్మి K90 అల్ట్రా గత నెలలో లాంచ్ అయింది. అయితే, ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్ 6.83-అంగుళాల అమోల్డ్ 1.5K (1,280 × 2,772 పిక్సెల్స్) డిస్ప్లేతో లభ్యమవుతుంది. 165Hz వరకు రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది.
