Redmi Note 15 SE Series : రెడ్‌మి నోట్ 15 SE కొనాలా? రెడ్‌మి నోట్ 15 కొనాలా? ఏది కొంటే బెటర్? ఫుల్ డిటెయిల్స్..!

Redmi Note 15 SE vs Redmi Note 15 : రెడ్‌మి నోట్ 15 SE కొనాలా? పాత మోడల్ రెడ్‌మి నోట్ 15 ఫోన్ కొనాలా? ఈ రెండింటిలో ఏది కొంటే బెటర్? ఎందులో ఫీచర్లు బాగున్నాయి? ఏ ఫోన్ ధర తక్కువ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Redmi Note 15 Series

  • రెడ్‌మి నోట్ 15, రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ ఏది కొనాలి?
  • రెడ్‌మి నోట్ 15 ఫీచర్లు, బ్యాటరీ, ధర వివరాలివే
  • పాత రెడ్‌మి ఫోన్ కన్నా స్పెషల్ ఎడిషన్ ధర చాలా తక్కువ

Redmi Note 15 SE vs Redmi Note 15 : కొత్త రెడ్ మి ఫోన్ కొనాలని చూస్తున్నారా? షావోమీ ఇండియా రెడ్‌మి నోట్ 15 లైనప్‌ను విస్తరించింది. రెడ్‌మి నోట్ 15 SE (స్పెషల్ ఎడిషన్) భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే, సాధారణ రెడ్‌మి నోట్ 15 కన్నా అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది.

ఈ కొత్త మోడల్ ధర రూ. 19,999 నుంచి ప్రారంభం కాగా, ధర పెంపు తర్వాత రెడ్‌మి నోట్ 15 ఇప్పుడు రూ. 24,999 నుంచి లభ్యమవుతోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు అద్భుతమైన స్పెసిఫికేషన్‌లు, ధర, కెమెరాలు, బ్యాటరీ సామర్థ్యంలో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో మీ బడ్జెట్ ధరలో ఏది లభిస్తుంది? అసలు ఏది కొంటే బెటర్? అనేది వివరంగా తెలుసుకుందాం..

ధరల వివరాలు :
వేరియంట్         రెడ్‌మి నోట్ 15 SE ధర            రెడ్‌మి నోట్ 15 ధర
6GB + 128GB             రూ. 19,999                    అందుబాటులో లేదు
8GB + 128GB                 రూ. 21,999                       రూ. 24,999
8GB + 256GB               రూ. 23,999                            రూ. 27,999

అన్ని కాన్ఫిగరేషన్‌లలోనూ రెడ్‌మి నోట్ 15 SE సరసమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.

డిజైన్, డిస్‌ప్లే :
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు కర్వడ్ ఎడ్జెస్, ‘స్క్విర్కిల్’ రియర్ కెమెరా మాడ్యూల్, 7.35mm మందం, 178g బరువుతో ఒకే విధమైన కొలతలతో ఒకే రకమైన డిజైన్ స్టయిల్ ఉంది. దుమ్ము, నీటి నిరోధకతకు IP65 + IP66 రేటింగ్‌ అందిస్తున్నాయి.

Read Also : Summer AC Tips : మీ AC కూలింగ్ తగ్గిందా? టెక్నీషియన్ వద్దు.. ఈ చిన్న సెట్టింగ్స్ మార్చితే ఏసీ సూపర్ కూలింగ్!

ఈ ఫోన్లలో డిస్‌ప్లే స్పెసిఫికేషన్‌లు ఒకేలా ఉంటాయి. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల FHD+ కర్వ్డ్ అమోల్డ్ ప్యానెల్‌ అందిస్తుంది. అయితే, SE వేరియంట్ క్రిమ్సన్ రిజర్వ్ కలర్ ఆప్షన్‌లో వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తుంది.

పర్ఫార్మెన్స్, బ్యాటరీ :
ఈ రెండు ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 6వ జనరేషన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్‌ఓఎస్ 2పై రన్ అవుతాయి. 4 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో సమానమైన పర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.

బ్యాటరీ సామర్థ్యంలో కొంచెం తేడా ఉంది. రెడ్‌మి నోట్ 15లోని 5,520mAh బ్యాటరీతో పోలిస్తే.. రెడ్‌మి నోట్ 15 ఎస్ఈలో 5,800mAh బ్యాటరీ ఉంది. SE మోడల్‌లో బ్యాటరీ మన్నిక కొద్దిగా మెరుగ్గా ఉంది.

కెమెరాలు :
ఫీచర్                          రెడ్‌మి నోట్ 15 SE            రెడ్‌మి నోట్ 15
ప్రైమరీ కెమెరా             50MP                       108MP
సెకండరీ కెమెరా          2MP డెప్త్ 8MP                  అల్ట్రా-వైడ్
ఫ్రంట్ కెమెరా                     20MP                           20MP

రెడ్‌మి నోట్ 15 SE ఫొటోగ్రఫీకి బెస్ట్ ఫోన్ అయితే రెడ్‌మి నోట్ 15 హై రిజల్యూషన్, అల్ట్రా-వైడ్ సామర్థ్యంతో అద్భుతమైన కెమెరా సిస్టమ్ అందిస్తుంది. ఈ రెండింటి మధ్య ఏది కొనాలి? అంటే మీ బడ్జెట్, బ్యాటరీ, కెమెరాతో సహా వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది.