Redmi Note 17 Launch : 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో కొత్త రెడ్‌మి నోట్ 17 సిరీస్.. భారత్ లాంచ్ డేట్‌పై భారీ అప్‌డేట్!
Redmi Note 17 Launch : ఆగష్టు 6న భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 17 లాంచ్ కానుంది. భారత్‌లో లాంచ్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, చైనీస్ వేరియంట్ కన్నా భిన్నంగా ఉండవచ్చు.
- Sreehari A
- Published on- July 16, 2026 / 08:00 PM IST
Redmi Note 17 Launch
- వచ్చే నెలలో భారత మార్కెట్లోకి రెడ్‌మి నోట్ 17 లాంచ్
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
- ఈ సిరీస్‌లో రెడ్‌మి నోట్ 17 ప్రో కూడా ఉండనుంది
Redmi Note 17 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి చైనాలో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్‌లో రెడ్‌మి నోట్ 17, రెడ్‌మి నోట్ 17 ప్రో సిరీస్ ఉన్నాయి.
ఈ సిరీస్‌లో బేస్ మోడల్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే, దేశంలో రెడ్‌మి నోట్ 17 ప్రో లాంచ్ సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. నివేదికల ప్రకారం.. షావోమీ ఆగస్టు 6న భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 17 ఫోన్ లాంచ్ కానుందని ప్రకటించింది.
భారత మార్కెట్లో లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, చైనీస్ వేరియంట్ కన్నా భిన్నంగా ఉండవచ్చని టిప్‌స్టర్ తెలిపారు. గత రిపోర్టుల ప్రకారం.. భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 17 ఫోన్ పోకో M8 పవర్‌గా లాంచ్ కావచ్చని సూచించాయి. అయితే, భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ సంబంధించి షావోమీ ఇంకా ధృవీకరించలేదు.
Read Also : Nubia NaviX Ultra Launch : స్మార్ట్‌ఫోన్ కాదు.. AI ఏజెంట్ ఫోన్ అంటున్న నుబియా.. జూలై 17నే గ్రాండ్ లాంచ్..!
రెడ్‌మి నోట్ 17 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఈ వారంలో చైనాలో రెడ్‌మి నోట్ 17 ఫోన్ లాంచ్ కాగా, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ 1,800 నిట్స్ టాప్ బ్రైట్ నెస్‌తో కూడిన 7-అంగుళాల ఫుల్ HD+ (1,080 x 2,396 పిక్సెల్స్) ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్ అడ్రెనో జీపీయూతో రన్ అవుతుంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతుంది. రెడ్‌మి నోట్ 17 బ్యాక్ సైడ్ రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్‌లో ఎఫ్/1.8 అపర్చర్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50ఎంపీ సింగిల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 8ఎంపీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1,080p/30fps వరకు వీడియోను రికార్డ్ చేయగలదు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8,000mAh బ్యాటరీ 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. రెడ్‌మి నోట్ 17 ప్రోలో 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ 3,200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్ 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది.
