Redmi Note 17 Series : భారీ బ్యాటరీ.. అదిరే కెమెరా.. రెడ్‌మి నోట్ 17 సిరీస్‌పై భారీ అంచనాలు!
Redmi Note 17 Series : రెడ్‌మి నోట్ 17 సిరీస్ జూలై 14న చైనాలో లాంచ్ కానుంది. భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్‌లు, కెమెరాలతో సహా స్పెసిఫికేషన్లు లీక్‌లు అయ్యాయి. భారత మార్కెట్లో ఈ రెండు ఫోన్లు లాంచ్ అవుతాయో లేదో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- July 12, 2026 / 06:49 PM IST
Redmi Note 17 Series
- రెడ్‌మి నుంచి కొత్తగా నోట్ 17, నోట్ 17 ప్రో సిరీస్
- ఈ నెల 14న చైనా మార్కెట్లో లాంచ్ కానున్న రెండు ఫోన్లు
- భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 17 సిరీస్ లాంచ్ అవుతుందా?
Redmi Note 17 Series : షావోమీ ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. రెడ్‌మి నుంచి సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. జూలై 14న చైనాలో రెడ్‌మి నోట్ 17 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీగా ఉంది. రెడ్‌మి ఇప్పటికే అధికారిక టీజర్ ద్వారా కొన్ని వివరాలను రివీల్ చేసింది. అయితే, రెడ్‌మి నోట్ 17, రెడ్‌మి నోట్ 17 ప్రో స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేద్దాం..
రెడ్‌మి నోట్ 17, రెడ్‌మి నోట్ 17 ప్రో స్పెసిఫికేషన్లు లీక్ :
రెడ్‌మి ఇప్పటికే రాబోయే ఫోన్లకు సంబంధించి కీలక డిజైన్ షేర్ చేసింది. రియర్ ప్యానెల్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉంచిన కొత్త రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. చైనీస్ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు ప్రకారం.. రెడ్‌మి నోట్ 17 ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
ఈ లీక్ ప్రకారం.. రెడ్‌మి ఫోన్ 9,000mAh భారీ బ్యాటరీతో రానుంది. 1.5K ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 50ఎంపీ మెయిన్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. అలాగే, హై రేంజ్ నోట్ 17 ప్రో డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది.
రెడ్ మి నోట్ 17 ప్రో మోడల్ మాత్రం 10000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1.5K ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటు 200MP మెయిన్ రియర్ కెమెరాతో వస్తుందని అంచనా. ఈ రెండు ఫోన్లలో వాటర్ రెసిస్టెన్స్ సపోర్టు కూడా ఉంటుంది.
భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 17 సిరీస్ లాంచ్? :
షావోమీ భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 17 సిరీస్ లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ, రెడ్‌మి నోట్ స్మార్ట్‌ఫోన్‌లు సాధారణంగా చైనాలో లాంచ్ తర్వాతే భారత్‌కు వస్తాయి.
రెడ్‌మి నోట్ 13, రెడ్‌మి నోట్ 14, రెడ్‌మి నోట్ 15 సిరీస్‌లతో సహా గత జనరేషన్, చైనాలో లాంచ్ అయిన వారాలు లేదా కొన్ని నెలల్లోనే భారత్‌లో లాంచ్ అయ్యాయి. కంపెనీ ఇదే వ్యూహాన్ని ఫాలో అయితే అతి త్వరలోనే రెడ్‌మి నోట్ 17 సిరీస్ కూడా భారత మార్కెట్లోకి కూడా రావచ్చు.
