Jio New international Packs : రిలయన్స్ జియో సరికొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్స్.. ఇన్-ఫ్లైట్ డేటా ప్లాన్లు, ఏయే దేశాల్లో ఎన్ని ప్లాన్లు ఉన్నాయంటే?

Jio New international Packs : రిలయన్స్ జియో యూఏఈ, యూఎస్ యూజర్ల కోసం ఇన్-ఫ్లైట్ డేటా ప్యాక్‌లతో పాటు కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియో రోమింగ్ ప్యాక్ పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Reliance Jio rolls out new international roaming packs

Jio New international Packs : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో అమెరికా, యూఏఈలో కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. 60శాతం తగ్గింపుతో ఇన్‌ఫ్లైట్ డేటా ప్యాక్‌లను రిలయన్స్ జియో తన సబ్‌స్క్రైబర్‌ల కోసం అందిస్తోంది. ఇందులో కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు, ఇన్-ఫ్లైట్ ప్యాక్‌లు ఉన్నాయి.

ఈ కొత్త ప్లాన్‌లు కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ యాజమాన్యంలోని టెల్కో యూఏఈ, యూఎస్ జియో యూజర్ల కోసం వార్షిక ప్రణాళికతో పాటు అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లను రూపొందించింది. ఈ సర్వీస్ ప్రొవైడర్ 60శాతం చౌకైన ఇన్-ఫ్లైట్ ప్లాన్‌లను కూడా ప్రవేశపెట్టింది.

యూఏఈలో అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లు :
యూఏఈ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ల కింద రిలయన్స్ జియో 3 కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. టెల్కో రూ. 2,998, రూ. 1598, రూ. 898 అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లను రిలీజ్ చేసింది. రూ. 2,998 ప్లాన్ కింద.. యూజర్లు 250 అవుట్‌గోయింగ్ మినిట్స్, 250 ఇన్‌కమింగ్ మినిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ 21 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 7GB డేటాను కూడా పొందవచ్చు.

Read Also : Jio Bharat GPT : చాట్‌జీపీటీ ఇక కాస్కో.. జియో నుంచి ఏఐ ‘భారత్ జీపీటీ’ వస్తోంది.. ఆకాష్ అంబానీ మాటల్లోనే..!

ఈ ప్లాన్‌లో 100 ఎస్ఎంఎస్ కూడా ఉన్నాయి. మరోవైపు, రూ.1598 ప్లాన్ 150 అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ నిమిషాలతో పాటు 3జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ 14 రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. చివరగా, రూ.898 ప్లాన్ 1జీబీ డేటా, 100 ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ నిమిషాలను అందిస్తుంది. 7 రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. అలాగే, 100 ఎస్ఎంఎస్‌లను కూడా పొందవచ్చు.

Reliance Jio us data plans

అమెరికాలో అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లు :
యూఏఈ మాదిరిగానే.. అమెరికా వెళ్లే జియో యూజర్ల కోసం కంపెనీ మూడు కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లను ప్రకటించింది. టెల్కో రూ. 3455, రూ. 2555, రూ. 1555 ప్లాన్‌లను రిలీజ్ చేసింది. అన్ని ప్లాన్‌లు కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందిస్తాయి. రూ. 3455 ప్లాన్ కింద.. ప్రయాణికులు కాల్ చేయడానికి 250 నిమిషాలు, 25జీబీ డేటా పొందుతారు.

ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 100 ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తుంది. రూ.2555 ప్లాన్‌లో భాగంగా రిలయన్స్ జియో వినియోగదారులు 100 ఎస్ఎంఎస్‌లతో 250 నిమిషాలు, 15జీబీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ 21 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తుంది. రూ. 1555 ప్లాన్ కింద 10 రోజులు వ్యాలిడిటీ పొందవచ్చు. 100 ఎస్ఎంఎస్, 150 కాలింగ్ నిమిషాలతో మొత్తం 7జీబీ డేటాను అందిస్తుంది.

వార్షిక రోమింగ్ ప్యాక్‌లు :
కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లతో పాటు, రిలయన్స్ జియో కొత్త వార్షిక ప్యాక్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 2,799 ఉండగా.. వార్షిక ప్లాన్ 51 దేశాలలో వర్తిస్తుంది. 2జీబీ డేటాతో పాటు 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

Reliance Jio Data Plans

ఇన్-ఫ్లైట్ డేటా ప్యాక్‌లు :
సర్వీస్ ప్రొవైడర్ రూ. 195, రూ. 295, రూ. 595 అనే 3 కొత్త ఇన్-ఫ్లైట్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. వినియోగదారులు ఈ మూడు ప్లాన్‌ల కింద 100 వాయిస్ మినిట్స్, 100 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. అలాగే, అన్ని ప్లాన్‌లు ఒక రోజు వరకు వ్యాలిడిటీ అందిస్తాయి. రూ.195 ప్లాన్‌లో 250ఎంబీ డేటా, రూ.295, రూ.595 ప్లాన్‌లు వరుసగా 500ఎంబీ, 1జీబీ డేటాను అందిస్తాయి.

వివిధ దేశాల్లో ఇన్-ఫ్లైట్ వాయిస్, డేటా ప్యాక్‌లు :
రిలయన్స్ జియో 22 ఎయిర్‌లైన్స్ మరియు 51 కౌంటీలకు వర్తించే నాలుగు ఇన్-ఫ్లైట్ ప్లాన్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్‌లలో రూ.2,499, రూ.4,999, రూ.3999, రూ.5,999 ఉన్నాయి. రూ.2,499 ప్లాన్ కింద వినియోగదారులు 100 అవుట్‌గోయింగ్ మినిట్స్, 250ఎంబీ డేటా, 10 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్ 35 దేశాలకు వర్తిస్తుంది. రిలయన్స్ జియో నుంచి రూ.4,999 ఇన్-ఫ్లైట్ ప్లాన్ 1500 నిమిషాలు, 5జీబీ డేటా, 1500 ఎస్ఎంఎస్ అందిస్తుంది.

Reliance Jio in-flight data packs

ఈ ప్లాన్ 30 రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. రూ.3,999 ప్లాన్.. 4జీబీ డేటాతో పాటు 30 రోజుల వ్యాలిడిటీ, 100 ఎస్ఎంఎస్‌‌లను అందిస్తుంది. చివరగా, రూ. 5,999 ప్లాన్ 400 కాలింగ్ నిమిషాలు, 6జీబీ డేటా, 500 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా 30 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తుంది. రూ. 4,999, రూ. 3,999, రూ. 5,999 ప్లాన్‌లు 51 దేశాలలో అందుబాటులో ఉన్నాయి.

Read Also : Jio Extra Data Plans : రిలయన్స్ జియో డేటా ఆఫర్లు.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లపై అదనపు డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి

ట్రెండింగ్ వార్తలు