Jio Cheapest Plan : జియో చీపెస్ట్ ప్లాన్ ! 84 రోజులు ఫుల్ ఎంజాయ్.. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా అక్కర్లేనివారికి పండగే..!

Jio Cheapest Plan : జియో అత్యంత చౌకైన ప్లాన్లను 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఈ ప్లాన్ల ద్వారా అన్ లిమిటెడ్ కాలింగ్, ఇతర బెనిఫిట్స్ పొందవచ్చు. పూర్తి ప్లాన్ల వివరాలివే..

Jio Cheapest Plan ( Image Credit : AI )

  • జియో యూజర్ల కోసం అత్యంత చౌకైన ప్లాన్లు
  • డేటా లేకుండా కేవలం కాలింగ్ కోసం 84 రోజుల వ్యాలిడిటీ
  • ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, 100 ఫ్రీ SMS బెనిఫిట్స్

Jio Cheapest Plan : జియో యూజర్లకు పండగే పండగ.. అత్యంత సరసమైన ధరకే ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జియో చౌకైన ప్లాన్లతో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో సహా అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. అలాగే 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. తక్కువ ధరకే 12 వారాల కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. జియో ప్లాన్ల పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

84 రోజుల చౌకైన ప్లాన్లు :
గత ఏడాది ట్రాయ్ (TRAI) ఆదేశాల మేరకు టెలికాం కంపెనీలు యూజర్లకు (Jio Cheapest Plan) కేవలం కాలింగ్, SMS బెనిఫిట్స్ మాత్రమే అందించే వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. ఆ తర్వాత ఈ సరసమైన ప్లాన్లు యూజర్లకు పూర్తి 84 రోజుల వ్యాలిడిటీతో లభిస్తున్నాయి.

రూ. 448 రీఛార్జ్ ప్లాన్ :
అన్‌లిమిటెడ్ కాలింగ్ దేశంలో ఎక్కడికైనా కాల్స్ చేసేందుకు ఫ్రీ నేషనల్ రోమింగ్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. కంపెనీ యూజర్లకు మొత్తం 1,000 ఫ్రీ SMS బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ జియో ప్లాన్ ద్వారా ఫ్రీ ఓటీటీ సర్వీసులను పొందవచ్చు.

Read Also : Mobile Loan Default : ఫోన్ EMI బాకీనా..? మీ మొబైల్ బ్లాక్ చేస్తారా? RBI కొత్త రూల్స్.. ఇలా చేస్తే బ్యాంకులకే గంటకు రూ.250 ఫైన్!

జియో ఏఐ క్లౌడ్, జియో టీవీకి ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 448. కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ ప్లాన్‌ యాడ్ ఆన్ వాల్యూ ప్లాన్‌గా పేర్కొంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రత్యేకంగా జియో నంబర్‌ను సెకండరీ సిమ్‌గా వాడే వారికి బెస్ట్ అని చెప్పొచ్చు.

రూ. 1028 ప్లాన్ :
జియో రూ. 1,028 రీఛార్జ్ ప్లాన్‌ కూడా అందిస్తోంది. పూర్తిగా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో దేశమంతటా ఫ్రీ అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా పొందవచ్చు.