Samsung Android 17 Update : శాంసంగ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. వన్ UI 9 అప్‌డేట్ వచ్చే ఫోన్లు, టాబ్లెట్లు ఏవో తెలుసా? ఫుల్ లిస్ట్..!
Samsung Android 17 Update : శాంసంగ్ త్వరలో ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9 లాంచ్ చేయనుంది. గెలాక్సీ S, A, M, F, Z సిరీస్‌లోని పలు స్మార్ట్‌ఫోన్‌లు ఈ అప్‌డేట్‌ను పొందవచ్చు. లాంచ్ సమయం, కొత్త ఫీచర్లు, సపోర్ట్ చేసే ఫోన్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published on- July 13, 2026 / 10:09 PM IST
Samsung Android 17 Update
- ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9 త్వరలో లాంచ్ కావచ్చు
- గెలాక్సీ S, A, M, F, Z సిరీస్, పలు మోడళ్లకు ఈ కొత్త అప్‌డేట్
- శాంసంగ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు కొత్త యూఐ మార్పులు ఉండొచ్చు
Samsung Android 17 Update : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. త్వరలో ఆండ్రాయిడ్ 17 ఆధారిత కొత్త వన్ యూఐ 9 అప్‌డేట్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ కంపెనీ ప్రస్తుతం ఎంపిక చేసిన గెలాక్సీ డివైజ్‌లపై బీటా ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది.
కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులకు సంబంధించి కీలక వివరాలను రివీల్ అయ్యాయి. వన్ యూఐ 9 అప్‌డేట్ ఏ డివైజ్‌లు అందుకుంటాయో శాంసంగ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ప్రస్తుత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అందుకోబోయే ఫోన్లు, టాబ్లెట్ల లిస్టును ఓసారి లుక్కేయండి..
శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో జూలై 22, 2026న వన్ యూఐ 9ను ఆవిష్కరించనుంది. అదే ఈవెంట్‌లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 కూడా ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌తో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. ఆ తర్వాత, సెప్టెంబర్ 2026 నుంచి పాత గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల కోసం స్టేబుల్ అప్‌డేట్‌లు లాంచ్ అవుతాయని అంచనా.
ప్రస్తుతం, వన్ యూఐ 9 బీటా వెర్షన్ గెలాక్సీ S26 సిరీస్‌కు మాత్రమే పరిమితం కానున్నాయి. కానీ, భవిష్యత్తులో ఇతర డివైజ్‌లకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుత శాంసంగ్ అప్‌డేట్ ప్రకారం.. సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌ల లిస్టు ఈసారి చాలా పెద్దది. అయితే, ఫైనల్ లిస్టు శాంసంగ్ త్వరలో వెల్లడించనుంది. ఇతర మోడల్స్ కూడా లేటెస్ట్ OS అప్‌గ్రేడ్‌లను అందుకునే అవకాశం ఉంది.
వన్ యూఐ 9 సపోర్టు చేసే ఫోన్లు ఇవే :
గెలాక్సీ S సిరీస్ : గెలాక్సీ S26, S26+, S26 అల్ట్రా, గెలాక్సీ S25, S25+, S25 అల్ట్రా, S25 ఎడ్జ్, S25 FE, గెలాక్సీ S24, S24+, S24 అల్ట్రా, S24 FE, గెలాక్సీ S23, S23+, S23 అల్ట్రా, S23 FE
గెలాక్సీ Z సిరీస్ : గెలాక్సీ Z ఫోల్డ్ 8, గెలాక్సీ Z ఫ్లిప్ 8, గెలాక్సీ Z ట్రైఫోల్డ్, గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE, గెలాక్సీ Z ఫోల్డ్ స్పెషల్ ఎడిషన్, గెలాక్సీ Z ఫోల్డ్ 6, గెలాక్సీ Z ఫ్లిప్ 6, గెలాక్సీ Z ఫోల్డ్ 5, గెలాక్సీ Z ఫ్లిప్ 5
గెలాక్సీ A సిరీస్ : గెలాక్సీ A57, A56, A55, A54, గెలాక్సీ A37, A36, A35, A34, గెలాక్సీ A27, A26, A25, A24, గెలాక్సీ A17 (4G/5G), A16 (4G/5G), A15 (4G/5G), గెలాక్సీ A07 (4G/5G), A06 5G
గెలాక్సీ M సిరీస్ : గెలాక్సీ M56, M55, M55s, M54, గెలాక్సీ M47, గెలాక్సీ M36, M35, M34, గెలాక్సీ M17, M17e, M16, M15, గెలాక్సీ M07, M06
గెలాక్సీ ఎఫ్ సిరీస్ : గెలాక్సీ F70e, గెలాక్సీ F56, F55, F54, గెలాక్సీ F36, F34, గెలాక్సీ F17, F16, F15, గెలాక్సీ F07, F06
కంపెనీ ఇప్పటికే వన్ యూఐ 8.5లో మెయిన్ డిజైన్ మార్పులు చేసింది. వన్ యూఐ 9 ఇంటర్‌ఫేస్‌ను పూర్తిగా మార్చకపోవచ్చు. అయినప్పటికీ, ఈ కొత్త అప్‌డేట్ అనేక అప్‌గ్రేడ్స్ అందిస్తుందని భావిస్తున్నారు.
రిపోర్టుల ప్రకారం.. ఇందులో బ్రైట్‌నెస్ వాల్యూమ్ కోసం మందపాటి స్లైడర్‌లు, సైజు ఛేంజ్ చేసే మీడియా ప్లేయర్ విడ్జెట్‌లు, ఆల్బమ్ ఆర్ట్‌తో వేవ్‌ఫార్మ్ యానిమేషన్‌లు వంటి లిక్విడ్ గ్లాస్ యూఐ ఎఫెక్ట్‌లు, కొత్త గెలాక్సీ ఏఐ ఫీచర్‌లు ఉండవచ్చు.
క్రియేటివ్ స్టూడియోను సిస్టమ్ యాప్‌లో మెర్జ్ చేయవచ్చు. గుడ్ లాక్ హోమ్ అప్ మాడ్యూల్, మల్టీ ఫింగర్ గెచర్స్ సపోర్టు అందిస్తుంది. శాంసంగ్ బ్రౌజర్‌లో కొత్త ఆస్క్ ఏఐ ఫీచర్ కూడా అందుబాటులోకి వస్తుందని అంచనా.
