Samsung Budget Phones : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) రెండు బడ్జెట్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో శాంసంగ్ Galaxy S సిరీస్ స్మార్ట్‌ఫోన్ రేంజ్ విస్తరించింది. శాంసంగ్ (Samsung Galaxy A04), (Samsung Galaxy A04e) ఫోన్లను ప్రవేశపెట్టింది. రెండు హ్యాండ్సెట్లు 5,000mAh బ్యాటరీతో రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తున్నాయని పేర్కొన్నారు. రెండు కెమెరా సెన్సార్లను అందిస్తోంది. శాంసంగ్ Galaxy A04, Galaxy A04e ఫోన్ల ఫీచర్లు, ధరల గురించి ఇప్పుడు చూద్దాం..
శాంసంగ్ గెలాక్సీ A04 ధర, ఫీచర్లు ఎంతంటే? :
శాంసంగ్ Galaxy A04 ఫోన్ రెండు స్టోరేజ్ మోడల్‌లలో అందించింది. 65GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999, అయితే 128GB మోడల్‌ను రూ. 12,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 20 నుంచి శాంసంగ్ ఆన్లైన్ స్టోర్, ఇతర ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.
హ్యాండ్‌సెట్‌లో గ్రీన్, కాపర్, బ్లాక్ అనే మూడు కలర్ వేరియంట్లు ఉన్నాయి. 720×1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల LCD డిస్ప్లేతో వచ్చింది. శాంసంగ్ Galaxy A04, MediaTek Helio P35 చిప్సెట్తో వచ్చింది. ఆండ్రాయిడ్ (Android 12) ఆధారంగా One UI కోర్ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
కెమెరా ముందు భాగంలో.. వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 2MP డెప్త్ సెన్సార్‌తో వచ్చింది. సెల్ఫీల కోసం, స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 5MP కెమెరాతో వస్తుంది. ఈ డివైజ్ 4GB RAMని 64GB, 128GB స్టోరేజీ సామర్థ్యంతో వచ్చింది. స్టోరేజీని విస్తరించేందుకు మైక్రో SD కార్డ్ స్లాట్‌తో వస్తుంది.
శాంసంగ్ Galaxy A04 ఫోన్ 5,000mAh బ్యాటరీ సపోర్టుతో ఇస్తుంది. అడాప్టివ్ పవర్ సేవింగ్ మోడ్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఫీచర్లలో Wi-Fi, బ్లూటూత్ 5.0, 3.5mm ఆడియో జాక్, ఇంటర్నల్ GPS, డ్యూయల్-సిమ్ సపోర్ట్, ఛార్జింగ్ కోసం USB-C పోర్ట్ అందుబాటులో ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ A04e ధర, ఫీచర్లు ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ (Galaxy A04e) మూడు వేరియంట్లను కలిగి ఉంది. బేస్ మోడల్ 3GB RAMని 32GB స్టోరేజ్‌తో వచ్చింది. దీని ధర రూ. 9,299గా ఉంది. ఇతర శాంసంగ్ మోడల్‌లు 3GB RAM + 64GB ROM, 4GB RAM + 128GB ROM ధర వరుసగా రూ. 9,999, రూ. 11,499తో వచ్చింది.
లైట్ బ్లూ, కాపర్ ఫోన్ కలర్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ A04 వంటి ఫీచర్లతో వస్తుంది. డ్యుయల్ కెమెరా పరంగా మాత్రమే భిన్నంగా ఉంటుంది. శాంసంగ్ Galaxy A04e ఫోన్ 13MP ప్రధాన కెమెరాను 2MP డెప్త్ సెన్సార్‌తో వచ్చింది. ప్రాసెసర్, డిస్ప్లేతో పాటు బ్యాటరీతో సహా ఇతర ఫీచర్లు ఒకేలా ఉంటాయి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..