×
Ad

Samsung Galaxy S24 : వారెవ్వా.. ఈ శాంసంగ్ ఫోన్ కొనాల్సిందే.. సగానికి సగం తగ్గింది భయ్యా.. డోంట్ మిస్..!

Samsung Flagship Phone : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ S24 అసలు ధర నుంచి ఏకంగా రూ. 38వేలు తగ్గింపు పొందింది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/6
Samsung Flagship Phone : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S24 ధర భారీగా తగ్గింది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ శాంసంగ్ మోడల్ లాంచ్ ధర కన్నా తగ్గింపు ధరకే లభిస్తోంది. అధికారిక ధర తగ్గింపుతో ఏకంగా రూ. 38వేలు తగ్గింది.
2/6
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అదనపు బ్యాంక్ ఆఫర్లతో అసలు ధర నుంచి సగానికి సగం తగ్గింపు ధరకే లభిస్తోంది. మీరు కూడా ఈ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ కోసం చూస్తుంటే అద్భుతమైన ఆఫర్ అసలు వదులుకోవద్దు. ఇంతకీ ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/6
శాంసంగ్ గెలాక్సీ S24 ధర, ఆఫర్లు : స్నాప్‌డ్రాగన్ ఆధారిత శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 8GB ర్యామ్+ 128GB, 8GB ర్యామ్ + 256GB, బేస్ వేరియంట్ (8GB + 128GB) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.47,999 నుంచి అందుబాటులో ఉంది.
4/6
ఈ సేల్ సమయంలో కొనుగోలుదారులు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ప్రారంభ ధర రూ.40,999 వరకు ఉంటుంది. ఈ డిస్కౌంట్‌తో పాటు ఆసక్తిగల యూజర్లు ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా అదనంగా రూ. 4వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
5/6
శాంసంగ్ గెలాక్సీ S24 కీలక స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S24 అనేది అడ్వాన్స్ టెక్నాలజీతో కాంపాక్ట్ పవర్‌హౌస్ కలిగి ఉంది. డిస్‌ప్లే పరంగా 120Hz హై రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే కలిగి ఉంది. ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌, 8GB ర్యామ్ కలిగి ఉంది.
6/6
బ్యాటరీ పరంగా పరిశీలిస్తే.. 25W వైర్డు వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటికీ సపోర్టు ఇచ్చే 4,000mAh బ్యాటరీతో వస్తుంది. కెమెరాల పరంగా మల్టీఫేస్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్, 50MP మెయిన్ సెన్సార్, 10MP, 12MP కెమెరాలు, 12MP కెమెరా సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ బెనిఫిట్స్ పొందవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OneUI 6పై రన్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ గెలాక్సీ AI ఫీచర్లు కలిగి ఉంటుంది.