Samsung Galaxy Phones : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? ఈ ఫోన్ మోడళ్ల ధరలు భారీగా పెరిగాయి.. కొత్త ధరలివే..?

Samsung Galaxy Phones : భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A, F సిరీస్‌లకు సంబంధించి అనేక స్మార్ట్‌ఫోన్ల ధరలను భారీగా పెరిగాయి. ఈ కొత్త ధరలు లీక్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

1/7
Samsung Galaxy Phones : శాంసంగ్ అభిమానులకు బిగ్ షాక్.. శాంసంగ్ ఇండియా గెలాక్సీ A, F సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను భారీగా పెరిగాయి. లీకుల ప్రకారం.. ఏప్రిల్ 10, 2026 నుంచి కంపెనీ అనేక మోడళ్ల ధరల పెంపు అమల్లోకి వస్తుంది.
2/7
ఈ లిస్టులో ఎంట్రీ-లెవల్ నుంచి మిడ్-రేంజ్ వరకు ఉన్న ఫోన్‌లు ఉన్నాయి. ఈ ధరల పెంపు భారీగా ఉన్నట్టు కనిపిస్తోంది. టిప్‌స్టర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లు, ఇంటర్నల్ డాక్యుమెంట్ల ప్రకారం.. శాంసంగ్ ఈ ఫోన్‌ల ధరలు భారీ మొత్తంలో పెరిగినట్టు తెలుస్తోంది. లీక్ డాక్యుమెంట్ ప్రకారం కొత్త ధరలు ఏప్రిల్ 10, 2026 నుంచి అమల్లోకి వస్తాయి.
3/7
శాంసంగ్ గెలాక్సీ A07 నుంచి 4GB + 64GB వేరియంట్ ధర గతంలో రూ. 9,749 నుంచి ఇప్పుడు రూ. 10,999కి తగ్గింది. అంటే.. సుమారుగా రూ. 1,250 పెరిగింది. శాంసంగ్ గెలాక్సీ A06 5జీ వివిధ వేరియంట్ల ధరలు కూడా రూ. 1,000 వరకు పెరిగాయి. 4GB + 64GB మోడల్ ధర ఇప్పుడు రూ. 13,499 కాగా, 4GB + 128GB వేరియంట్ ధర రూ. 15,499, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 17,499గా ఉంది.
4/7
శాంసంగ్ గెలాక్సీ A07 5జీ వేరియంట్ల ధరలు కూడా మారాయి. 4GB + 128GB మోడల్ ధర ఇప్పుడు రూ. 16,499 కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 18,499గా ఉంది. అదేవిధంగా, గెలాక్సీ A17 5G వేరియంట్ల ధరలు కూడా రూ. 1,000 నుంచి రూ.1,500 వరకు పెరిగాయి. 6GB + 128GB మోడల్ ధర రూ. 21,499కి, 8GB + 128GB వేరియంట్ ధర రూ. 23,499కి, 8GB + 256GB మోడల్ ధర రూ. 27,999కి చేరింది.
5/7
మిడ్ రేంజ్ కేటగిరీలో శాంసంగ్ గెలాక్సీ A36 ధర కూడా రూ. 1,500 నుంచి రూ. 3,000 వరకు పెరిగింది. 8GB + 128GB వేరియంట్ ధర ఇప్పుడు రూ. 33,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 37,999, 12GB + 256GB మోడల్ ధర రూ. 43,499గా ఉంది.
6/7
అదేవిధంగా, శాంసంగ్ గెలాక్సీ A56 ధర కూడా రూ. 2,000 నుంచి రూ.3,500 వరకు పెరిగింది. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 42,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 46,999, 12GB + 256GB వేరియంట్ ధర రూ. 52,499గా ఉంది.
7/7
శాంసంగ్ గెలాక్సీ F17 5జీ, అన్ని వేరియంట్ల ధరలు రూ. 1,000 వరకు పెరిగినట్లు సమాచారం. 4GB + 128GB వేరియంట్ ధర రూ. 17,999, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 19,999, 8GB + 128GB వేరియంట్ ధర రూ. 21,999గా నిర్ణయించారు. ఈ ధరల పెంపుపై శాంసంగ్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.