Samsung Galaxy A27 : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. ఫ్లాగ్‌షిప్ డిజైన్‌తో కొత్త శాంసంగ్ ఫోన్ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్..!
Samsung Galaxy A27 : ఈ శాంసంగ్ గెలాక్సీ A27లో రెండర్‌లలో శాంసంగ్ ఫోన్ పర్పల్ కలర్ ఆప్షన్లలో కనిపిస్తుంది. ఈ ఫోన్ ప్యానెల్ ఫ్లాట్‌గా ఉంటుందని అంచనా. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- April 17, 2026 / 08:03 PM IST
Samsung Galaxy A27
- శాంసంగ్ గెలాక్సీ A27 ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లే వస్తోంది
- ఈ శాంసంగ్ ఫోన్ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో రావచ్చు
- కొలతలు 162.3 x 78.6×7.9mm ఉండవచ్చు
- బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా
Samsung Galaxy A27 : శాంసంగ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో సరికొత్త ఫోర్ రాబోతుంది. శాంసంగ్ గెలాక్సీ A27 బడ్జెట్ మిడ్-రేంజ్ ఫోన్ లాంచ్ కానుంది. అంతకన్నా ముందే ఈ ఫోన్ డిజైన్ రివీల్ అయింది.
అంతేకాదు.. ఈ ఫోన్ CAD రెండర్లు కూడా లీక్ అయ్యాయి. డిజైన్ పరంగా కీలక మార్పు కనిపిస్తోంది. కంపెనీ ఫోన్ ఫ్రంట్ సైడ్ కీలక డిజైన్ పూర్తిగా రీడిజైన్ చేస్తోంది. ఫ్లాగ్‌షిప్ మాదిరిగా డిజైన్ ఆకట్టుకునేలా ఉండొచ్చు. 5000mAh బ్యాటరీతో రావొచ్చు. ఇతర కీలక ఫీచర్లను వివరంగా పరిశీలిద్దాం..
శాంసంగ్ గెలాక్సీ A27 డిజైన్ :
శాంసంగ్ గెలాక్సీ A27 డిజైన్‌లో అతిపెద్ద మార్పు కనిపిస్తోంది. ఈ ఫోన్ CAD రెండర్లు లీక్ అయ్యాయి. 3D క్యాడ్ రెండర్లను ఆన్‌లీక్స్ (Onleaks ) అనే సంస్థ ఎక్స్ వేదికగా లీక్ చేసింది. ఇంతకుముందు, కంపెనీ ఈ ఫోన్లలో నాచ్ డిజైన్‌ను ఇస్తూ వచ్చింది.
ఫ్రంట్ కెమెరా ఎప్పుడూ బెజెల్స్‌లో ఉండేది. కానీ, ఈసారి కంపెనీ ఇందులో పంచ్ హోల్ డిజైన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండర్లలో ఫోన్ రూపం చాలా అప్‌గ్రేడ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఒక ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లాగా కనిపిస్తోంది. శాంసంగ్ కంపెనీ నుంచి ఇదే అతిపెద్ద అప్‌గ్రేడ్ కావచ్చు.
ఈ రెండర్‌లలో శాంసంగ్ ఫోన్ పర్పల్ కలర్ ఆప్షన్లలో కనిపిస్తోంది. ఈ లీక్ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా రివీల్ చేసింది. ఈ శాంసంగ్ ఫోన్‌లో 6.7-అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఈ ప్యానెల్ ఫ్లాట్‌గా ఉంటుంది. ఫోన్ కొలతలు 162.3 x 78.6 x 7.9mm ఉంటాయని అంచనా. థిన్ షేప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు, ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉన్నట్లు సమాచారం.
శాంసంగ్ గెలాక్సీ A27 స్పెసిఫికేషన్లకు సంబంధించి పుకార్లు వస్తున్నాయి. కంపెనీ ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ ఇంకా గెలాక్సీ A27పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
త్వరలోనే దీనిపై సౌత్ కొరియన్ దిగ్గజం ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు, ప్రస్తుత మెమరీ చిప్‌ల కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతున్న వేళ ఈ శాంసంగ్ కొత్త ఫోన్ ధర కూడా పెరిగే అవకాశం ఉంది.
