Samsung Galaxy A27 : 50MP కెమెరాతో రచ్చకు రెడీ.. శాంసంగ్ గెలాక్సీ A27 వచ్చేస్తోంది.. ఫీచర్స్ చూస్తే షాక్ అవుతారు!

Samsung Galaxy A27 : ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల డిస్‌ప్లే, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. పూర్తి వివరాలివే

Samsung Galaxy A27

  • ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ ఉండొచ్చు
  • శాంసంగ్ గెలాక్సీ A27లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉండవచ్చు
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా సెటప్

Samsung Galaxy A27 : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? సౌత్ కొరియా సంస్థ శాంసంగ్ నుంచి త్వరలో కొత్త శాంసంగ్ గెలాక్సీ A సిరీస్‌ రాబోతుంది. కొన్ని లీక్‌ల ప్రకారం.. రాబోయే కొత్త శాంసంగ్ గెలాక్సీ A27 ఫోన్ స్పెసిఫికేషన్లు ముందుగానే లీక్ అయ్యాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా లిస్ట్ అయింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుందని భావిస్తున్నారు. గత ఏడాదిలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ A26 స్థానంలో కొత్త ఫోన్ గెలాక్సీ A27 రాబోతుంది.

శాంసంగ్ గెలాక్సీ A37, శాంసంగ్ గెలాక్సీ A57 ఇటీవల లాంచ్ అయ్యాయి. మీడియా రిపోర్టు ప్రకారం.. బ్రెజిల్‌లోని శాంసంగ్ వెబ్‌సైట్‌లో రాబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన లిస్టింగ్ కనిపించింది. శాంసంగ్ గెలాక్సీ A27 త్వరలో లాంచ్ కానుందని అంచనా.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుందని అంచనా. శాంసంగ్ గెలాక్సీ A27లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా 2MP డెప్త్ సెన్సార్ ఉంటాయని భావిస్తున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 12MP ఫ్రంట్ కెమెరా ఉంటుందని అంచనా.

Read Also : Vivo X300 FE Review : ఫొటోగ్రఫీ కింగ్ వచ్చేసింది.. ట్రిపుల్ 50MP, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వివో దుమ్మురేపుతోంది!

శాంసంగ్ గెలాక్సీ A27 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A27 స్మార్ట్‌ఫోన్ SM-A276B అనే మోడల్ నంబర్‌తో గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ IMEIలో లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుందని అంచనా. ఆండ్రాయిడ్ 16తో పనిచేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ సంబంధించిన ఎలాంటి వివరాలను శాంసంగ్ ఇంకా రివీల్ చేయలేదు.

శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ విజన్ బూస్టర్ సపోర్ట్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ AMOLED+ డిస్‌ప్లేతో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్ 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.

ఈ 2 స్మార్ట్‌ఫోన్‌లు 50MP ప్రైమరీ కెమెరా, 5MP మాక్రో కెమెరా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్ 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ ఎక్సినోస్ 1680 ప్రాసెసర్‌, శాంసంగ్ గెలాక్సీ A37 5జీ, ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌ అందిస్తుంది. ఈ గెలాక్సీ A57 5జీ, శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి సంబంధించిన కొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 8.5 ఆధారిత వన్ యూఐ 16పై రన్ అవుతాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలోనూ 5,000mAh బ్యాటరీ ఉంది.