×
Ad

Samsung Galaxy A35 5G : కిర్రాక్ ఆఫర్ మావా.. అమెజాన్‌లో ఈ శాంసంగ్ కెమెరా ఫోన్ జస్ట్ రూ. 19,999కే.. ఎలాగంటే?

Samsung Galaxy A35 5G Sale : శాంసంగ్ ఫోన్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఈ బెస్ట్ కెమెరా ఫోన్ ధర అమెజాన్‌లో కేవలం రూ. 19,999కే లభిస్తోంది. అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/7
Samsung Galaxy A35 5G Sale : శాంసంగ్ అభిమానులకు అద్భుతమైన ఆఫర్. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మిడ్-రేంజ్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ A35 5జీ అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్‌ 50MP OIS కెమెరాతో ఫొటోలు, వీడియోలు హై క్వాలిటీతో రికార్డు చేయొచ్చు.
2/7
ఈ ఫోన్‌లో గూగుల్ 'సర్కిల్ టు సెర్చ్' ఫీచర్ కూడా ఉంది. ముఖ్యంగా, శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఇప్పుడు అమెజాన్‌లో రూ. 10వేల కన్నా ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది. ఎక్స్ఛేంజ్‌, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ధరను మరింత తగ్గించవచ్చు. ఈ శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఫోన్ కొనుగోలుపై ఆఫర్లు, మరిన్ని ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
3/7
శాంసంగ్ గెలాక్సీ A35 5జీపై అద్భుతమైన డీల్స్ : ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ A16 5జీపై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 128GB స్టోరేజ్ వెర్షన్ అసలు ధర రూ. 30,999 నుంచి రూ. 20,879కి తగ్గింది. రూ. 10,120 నేరుగా డిస్కౌంట్ పొందవచ్చు.
4/7
అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 626 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 9వేల వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తక్కువ బడ్జెట్‌లో 5G ఫోన్‌ కొనేవారికి ఈ ఆఫర్ అద్భుతంగా ఉంటుంది.
5/7
శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫీచర్లు : మిడ్ రేంజ్ ఫోన్లలో ఈ శాంసంగ్ 5జీ పవర్‌ఫుల్ ఫోన్‌. గెలాక్సీ A35 5జీ మోడల్ 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ ఫోన్‌కు పవర్ అందిస్తుంది.
6/7
కెమెరా విషయానికొస్తే.. మొత్తం 3 రియర్ కెమెరాలు ఉన్నాయి. OIS, 50MP ప్రైమరీ కెమెరా సపోర్టు ఇస్తుంది. అదనంగా, 5MP మాక్రో కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం వీడియో కాల్స్ చేసేందుకు 13MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
7/7
ఈ శాంసంగ్ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ కూడా సపోర్టు చేస్తుంది. సేఫ్టీ కోసం స్క్రీన్‌పై ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. IP67 రేటింగ్ ఉంది. ఈ ఫోన్ ఫ్రంట్, బ్యాక్ రెండింటిలోనూ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అందిస్తుంది.