Samsung Galaxy A35 : ఈ శాంసంగ్ ఫోన్ ఇంత కన్నా తక్కువ ధరకు మళ్లీ రాదు భయ్యా.. ఎంత పెట్టి కొంటారంటే?
Samsung Galaxy A35 : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ గెలాక్సీ A35 ధర భారీగా తగ్గింది. కొంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..
- Sreehari A
- Published On : March 25, 2026 / 03:17 PM IST
Samsung Galaxy A35 : శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A35పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ A35 అసలు ధర రూ. 32,999 ఉండగా ఇప్పుడు ఇది రూ. 13వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A35 మంచి బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు అద్భుతమైన స్క్రీన్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఆకర్షణీయంగా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ A35 ఆఫర్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ A35 ఫ్లిప్‌కార్ట్ డీల్ : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A35 కేవలం రూ. 19,999కే అందిస్తోంది. ప్రారంభ ధర రూ. 32,999పై రూ. 13,000 ఫ్లాట్ డిస్కౌంట్. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలుదారులు ఈ శాంసంగ్ ఫోన్ అసలు ధరపై రూ. 1,000 వరకు తగ్గించుకోవచ్చు.
అప్‌గ్రేడ్ కోసం మీ పాత ఫోన్ రూ. 15,950 ఎక్స్చేంజ్ వాల్యూకు మార్చుకోవచ్చు. అయితే, మీ పాత ఫోన్ ఫైనల్ ఎక్స్చేంజ్ వాల్యూ బ్రాండ్, మోడల్, పర్ఫార్మెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ 9 నెలల కాలానికి నెలకు రూ. 2,223 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ A35 స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ A35 5జీలో 6.7-అంగుళాల పెద్ద FHD+ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1,900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో స్మూత్ డిస్‌ప్లే అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 SoC ప్రాసెసర్, అడ్రినో 710 జీపీయూ, 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్, 6 జనరేషన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000mAh బ్యాటరీ కూడా ఉంది. కెమెరాల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5MP మాక్రో లెన్స్‌తో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ A35 కొనాలా? : శాంసంగ్ గెలాక్సీ A35 ఫోన్ IP67 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. 120Hz హై-రిఫ్రెష్ రేట్, స్మూత్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌తో వస్తుంది. పోకో ఎఫ్6, నథింగ్ ఫోన్ 2a, మోటోరోలా ఎడ్జ్ 50 నియో కూడా ఇదే రేంజ్ ఫీచర్లతో లభ్యమవుతున్నాయి.
