Samsung Galaxy A35 : బిగ్ డిస్కౌంట్ బ్రో.. రూ. 33వేల ఈ శాంసంగ్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ రూ. 19వేల లోపే..!

Samsung Galaxy A35 : శాంసంగ్ ఫోన్ ఆఫర్ అదిరింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 13,500 తగ్గింపుతో లభిస్తోంది. ఇలా కొన్నారంటే రూ. 19వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

1/6
Samsung Galaxy A35 : కొత్త శాంసంగ్ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. రూ. 20,000 బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ మీకోసమే. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A35పై అద్భుతమైన డీల్ అందిస్తోంది.
2/6
బ్యాంక్ ఆఫర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 19వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ట్రిపుల్-కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఎందుకు కొనాలి? ఎలా కొనాలి? డిస్కౌంట్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/6
శాంసంగ్ గెలాక్సీ A35 ధర డీల్ : ఈ శాంసంగ్ ఫోన్ లాంచ్ ధర రూ. 32,999 ఉండగా ఇప్పుడు రూ. 19,999 లోపు తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ. 1,000 డిస్కౌంట్ పొందవచ్చు. ధర రూ. 18,999కి తగ్గుతుంది.
4/6
మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోండి. రూ. 15,950 వరకు ఎక్స్చేంజ్ వాల్యూను పొందవచ్చు. మీ ఫోన్ వాల్యూ కండిషన్ బట్టి రేటు మారుతుంది. ఫ్లిప్‌కార్ట్ యూజర్లు నెలకు రూ. 3,334 ఈఎంఐతో కొనేసుకోవచ్చు. క్రెడిట్ కార్డులను బట్టి నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ పొందవచ్చు. ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఇతర యాడ్-ఆన్‌ కూడా పొందవచ్చు.
5/6
మీరు కొనాలా వద్దా? : సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ కావాలంటే ఈ మిడ్-రేంజ్ ఫోన్ కొనేసుకోవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. 1,900 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, అడ్రినో 710 జీపీయూ, 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15తో వస్తుంది.
6/6
6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు, 6 జనరేషన్స్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ వస్తాయి. ఈ ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. మంచి బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5MP మాక్రో లెన్స్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా ఉంది.