Samsung Galaxy A36 5G : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ చాలా చీప్ గురూ.. అమెజాన్‌లో జస్ట్..!
Samsung Galaxy A36 5G : శాంసంగ్ గెలాక్సీ ఎ36 5జీ ఫోన్ డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ సేల్ సమయంలో ఏకంగా రూ. 10వేలు తగ్గింపుతో ఇంటికి తెచ్చుకోవచ్చు..
- Sreehari A
- Published on- October 23, 2026 / 03:30 PM IST
Samsung Galaxy A36 5G
- శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ధరలో రూ. 10వేలకుపైగా తగ్గింపు
- అదనపు బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు ధర మరింత తగ్గింపు
- ఈ ఫోన్లో అదిరే డిస్ప్లే, ప్రాసెసర్, భారీ బ్యాటరీ
Samsung Galaxy A36 5G : రూ. 40వేల లోపు ధరలో కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ A36 భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇటీవలే ఈ శాంసంగ్ ఫోన్ ధర పెరిగింది. కానీ, ఇప్పుడు ధర రూ. 36,999కు లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ. 10వేలకుపైగా డిస్కౌంట్‌తో అందిస్తోంది.
బ్యాంక్, కార్డ్ ఆఫర్లతో ఇంకా తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. లిమిటెడ్ టైమ్ రూ. 1,000 కూపన్ కూడా అందిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A36 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ A36 ఫ్లిప్‌కార్ట్ డీల్ :
శాంసంగ్ గెలాక్సీ A36 ధర ఇటీవల పెరిగి ఇప్పుడు రూ. 36,999కి అమ్ముడవుతోంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం (Samsung Galaxy A36 5G) ఈ డివైస్‌ను రూ. 25,999కే అందిస్తోంది. రూ. 11వేలు ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ. 1,300 తగ్గింపు పొందవచ్చు. లిమిటెడ్ టైమ్ రూ. 1,000 కూపన్ కూడా అందిస్తోంది. తద్వారా ధర రూ. 23,699కి తగ్గుతుంది.
మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది.
మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, పర్ఫార్మెన్స్ బట్టి రూ. 20,400 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. ఈ ఫోన్ కోసం ముందుగా 6 నెలలకుగానూ నెలకు కేవలం రూ. 4,166 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ A36 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A36లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది. బయటకు వెళ్లే సమయంలో ఈ ప్యానెల్ 1,200 నిట్స్ టాప్ బ్రైట్నెస్ చేరుకోగలదని కంపెనీ పేర్కొంది.
అంతేకాదు.. స్క్రీన్‌ను గీతలు పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. తయారీదారులు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్‌ను కూడా అమర్చారు. IP67 సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి, ఈ శాంసంగ్ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ అందిస్తుంది.
ఈ డివైస్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6వ జెన్ 3 చిప్సెట్తో పాటు 8GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. శాంసంగ్, గెలాక్సీ A36ను ఆండ్రాయిడ్ 15 ఆధారిత స్కిన్ వన్ యూఐ 7తో అందిస్తోంది. అంతేకాదు.. ఈ సౌత్ కొరియా టెక్ దిగ్గజం ఈ డివైస్‌తో పాటు 6 జనరేషన్ ఓఎస్ అప్గ్రేడ్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్లను కూడా అందిస్తోంది.
కెమెరా విషయానికి వస్తే.. :
ఈ శాంసంగ్ ఫోన్ OISతో 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా కూడా ఉంది. బ్యాటరీ పరంగా చూస్తే ఈ శాంసంగ్ ఫోన్ 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ అందిస్తుంది.
