Samsung Galaxy A37 : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy A37 : శాంసంగ్ ఆఫర్ అదిరింది భయ్యా.. ఈ శాంసంగ్ గెలాక్సీ ఎ37 5జీ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఎలా పొందాలంటే?

1/7
Samsung Galaxy A37 : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అయితే, ఇదే అద్భుతమైన ఆఫర్. శాంసంగ్ గెలాక్సీ A37 ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఏప్రిల్ నెలలో అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది.
2/7
మీరు శాంసంగ్ లేటెస్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ కొనాలని చూస్తుంటే వెంటనే కొనేసుకోవడం బెటర్. మీకోసం అమెజాన్ అద్భుతమైన డీల్ అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ A37 డీల్ స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి ఆఫర్లపై ఓసారి లుక్కేయండి.
3/7
శాంసంగ్ గెలాక్సీ A37 అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A37 బేస్ వేరియంట్ రూ. 41,999 ధరకు లాంచ్ అయింది. అయితే, ప్రస్తుతం 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో ఆసమ్ చార్‌కోల్ కలర్ ఆప్షన్ అమెజాన్‌లో కేవలం రూ. 32,994కే లభిస్తోంది. తద్వారా రూ. 9,005 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
4/7
అంతేకాదు.. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా రూ. 989 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే ఈ శాంసంగ్ ఫోన్ ఇంకా తగ్గుతుంది.
5/7
శాంసంగ్ గెలాక్సీ A37 స్పెసిఫికేషన్లు : ఈ టెక్ దిగ్గజం లేటెస్ట్ గెలాక్సీ ఎ సిరీస్ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ HBM బ్రైట్‌నెస్, 1900 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ ఫ్రంట్, బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. అలాగే, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ అందిస్తుంది.
6/7
ఈ శాంసంగ్ ఫోన్ లోపల శాంసంగ్ ఎక్సినోస్ 1480 చిప్‌సెట్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ 12GB వరకు ర్యామ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5పై రన్ అవుతుంది. శాంసంగ్ 6 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌ అందిస్తుంది.
7/7
కెమెరాల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో OISతో 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 4K వీడియో రికార్డింగ్ 12MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇతర ఫీచర్లలో స్టీరియో స్పీకర్లు, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ఉన్నాయి.