Samsung Galaxy F70 Pro : గెట్ రెడీ.. కొత్త శాంసంగ్ ఫోన్ వస్తోందోచ్.. ఈసారి ఫీచర్లు నెక్స్ట్ లెవల్..!

Samsung Galaxy F70 Pro : శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో అతి త్వరలో లాంచ్ కాబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ వెబ్‌సైట్‌లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)లో కనిపించింది. లాంచ్ సహా పూర్తి ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.

1/6
Samsung Galaxy F70 Pro : శాంసంగ్ ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఫోన్ వస్తోంది. సౌత్ కొరియా ఫోన్ మేకర్ శాంసంగ్ అతి త్వరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేయనుంది. అదే.. శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో ఫోన్.. ఇప్పటికే ఈ శాంసంగ్ ఫోన్ పలు సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో లిస్టు అయింది. కొన్ని లీక్‌లు కూడా ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించాయి. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని భావిస్తున్నారు.
2/6
రాబోయే ఈ శాంసంగ్ ఫోన్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో SM-E476B మోడల్ నంబర్‌తో లిస్ట్ అయింది. ఈ లిస్టులో స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్ సాఫ్ట్‌వేర్‌ రివీల్ చేసింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుందని భావిస్తున్నారు. సింగిల్-కోర్ టెస్టులో 998 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 3,090 పాయింట్లు సాధించింది.
3/6
శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)లో కూడా కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్ SM-E476B/DS మోడల్ నంబర్‌తో బ్లూటూత్ ఎస్ఐజీ డేటాబేస్‌లో లిస్ట్ అయింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నేషనల్ వేరియంట్ కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్ శాంసంగ్ గెలాక్సీ M47 మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు.
4/6
అంతేకాదు.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. 6,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
5/6
మరోవైపు.. శాంసంగ్ ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లను అధికారికంగా వెల్లడించలేదు. కాకపోతే, కొత్త కలర్ ఆప్షన్లు, లెదర్ వంటి రియర్ ప్యానెల్ ఉంటుందని అంచనా. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5పై రన్ అవుతుంది. మిడ్-రేంజ్ ధర సుమారు రూ. 25వేల మధ్య ఉండొచ్చు.
6/6
గతంలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్‌తో పాటు 6.7-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ అడ్రినో 710 జీపీయూ ద్వారా రన్ అవుతుంది.