Samsung Galaxy S24 FE
Samsung Galaxy S24 FE : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ లాంచ్ కానుంది. అంతకన్నా ముందుగానే రూ.35వేల కన్నా తక్కువ ధరలో అద్భుతమైన శాంసంగ్ ఫోన్ కొనేసుకోవచ్చు.
కెమెరా, పర్ఫార్మెన్స్, డిస్‌ప్లేతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. బ్యాంక్ డిస్కౌంట్‌తో ఈ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్ ప్లాట్‌ఫామ్‌పై రూ.25వేల భారీగా తగ్గింపుతో లభిస్తుంది. ట్రిపుల్ కెమెరా, అమోల్డ్ ప్యానెల్, ఎక్సినోస్ చిప్‌సెట్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 FE ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ధర :
ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ఫోన్ బేస్ 8GB, 128GB వేరియంట్ ధర రూ.35,999కి లిస్ట్ అయింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కస్టమర్లు అదనంగా రూ.1,800 డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ.35వేల కన్నా తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.32,350 వరకు వాల్యూ పొందవచ్చు. వర్కింగ్ కండిషన్, బిల్లింగ్ తేదీ, మోడల్, వేరియంట్ అన్నింటిపై ఆధారపడి ఉంటుంది. కస్టమర్లు ఈ శాంసంగ్ ఫోన్ నెలకు రూ. 6వేలు ఈజీ ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు. అయితే, కొన్ని హిడెన్ ఛార్జీలు, ఇతర వివరాలు మీ బ్యాంక్ నిబంధనలు, షరతులను బట్టి వర్తిస్తాయి.
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ స్పెఫిషికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో FHD+ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. రెండు వైపులా గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ కూడా అందిస్తుంది. IP68 రేటింగ్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఈ శాంసంగ్ ఫోన్ 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజీతో ఎక్సినోస్ 2400e చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 4,700mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 8K వీడియో సపోర్ట్‌తో పాటు OISతో 50MP మెయిన్ సెన్సార్ ఉంది. ఏడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది.