×
Ad

Samsung Galaxy S24 : ఇది కదా డిస్కౌంట్.. రూ. 75వేల శాంసంగ్ ఫోన్‌ అమెజాన్‌లో జస్ట్ రూ.40,494కే.. ఎలాగంటే?

Samsung Galaxy S24 : శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ కు ముందే అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర భారీగా తగ్గింది. ఫీచర్ల కోసమైనా ఈ ఫోన్ కొనేసుకోవచ్చు. అది ఎలాగంటే?

  • Published On : February 20, 2026 / 07:58 PM IST

Samsung Galaxy S24

  • అతి త్వరలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
  • శాంసంగ్ గెలాక్సీ S24 ధర ఏకంగా రూ. 30వేలు తగ్గింపు
  • లాంచ్ ధర రూ.74,999 నుంచి డిస్కౌంట్
  • అన్ని డిస్కౌంట్లతో కలిపి ధర రూ.40,494కు అందుబాటులో

Samsung Galaxy S24 : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అతికొద్ది రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ రాబోతుంది. అంతకన్నా ముందే శాంసంగ్ గెలాక్సీ S24 ధర భారీగా తగ్గింది. గత లైనప్‌లో అన్ని ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 భారీ తగ్గింపుతో లభిస్తోంది. మీరు లేటెస్ట్ ప్రాసెసర్, ఫీచర్ల కోసం చూస్తుంటే అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ అసలు ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర తగ్గింపు :
128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో శాంసంగ్ గెలాక్సీ S24 8GB ర్యామ్ వేరియంట్ భారతీయ మార్కెట్లో రూ.42,994 ధరకు అందుబాటులో ఉంది. అసలు లాంచ్ ధర రూ.74,999 నుంచి తగ్గింది. కూపన్లు, ఆఫర్లతో రూ.2,500 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ధర రూ.40,494కి తగ్గుతుంది. ఈ ఫోన్ ఓనిక్స్ బ్లాక్, అంబర్ ఎల్లో అనే రెండు వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Best Selfie Camera Phones : సెల్ఫీ ప్రియులకు పండగే.. రూ. 25వేల లోపు ధరలో 5 బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్లు.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా?

శాంసంగ్ గెలాక్సీ S24 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 6.2-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ అడ్రినో 750 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌తో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ అందించే 7 మెయిన్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్‌లో 12MP ఫ్రంట్ స్నాపర్ ఉంది. 4000mAh బ్యాటరీతో పాటు 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రన్ అవుతుంది.