Samsung Galaxy S24 : ఖతర్నాక్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫోన్‌పై ఏకంగా రూ. 32వేలు తగ్గింపు.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు
Samsung Galaxy S24 : శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ ధర తగ్గింది. అమెజాన్‌లో దాదాపు రూ. 32వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఇలాంటి ఫ్లాగ్ షిప్ ఫోన్లపై డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.
- Sreehari A
- Published On : March 14, 2026 / 02:02 PM IST
Samsung Galaxy S24
- శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై రూ. 32వేల వరకు ఆదా
- ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.
- అమెజాన్‌లో శాంసంగ్ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?
Samsung Galaxy S24 : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన న్యూస్. కొంటే ఇప్పుడే కొనేసుకోండి. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ క్లాసీ లుక్, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మీరు కూడా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు.
అమెజాన్‌లో ప్రస్తుతం ఈ శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. అసలు ధర రూ.74,999 ఉండగా ఇప్పుడు రూ. 42,690కు తగ్గింది. అద్భుతమైన ఏఐ ఫీచర్లు, పవర్‌ఫుల్ కెమెరా, కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది.
Read Also : Poco M8 Price : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డీల్.. పోకో M8పై భారీ డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే?
శాంసంగ్ గెలాక్సీ S24 :
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ ప్రీమియం లుక్ అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 6.2-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ సపోర్టు చేస్తుంది. 8GB ర్యామ్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఫొటోగ్రఫీ కోసం 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
అమెజాన్‌లో ధర ఎంతంటే? :
ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ఓనిక్స్ బ్లాక్ (8GB + 128GB) వేరియంట్ ధర రూ. 43,990కు లభిస్తుంది. ఎంపిక చేసిన ఆప్షన్లపై రూ. 1,300 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అసలు ధర రూ.75వేల నుంచి భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
