Samsung Galaxy S24 : కొత్త శాంసంగ్ గెలాక్సీ S24 వచ్చేస్తోందోచ్.. ఫ్లిప్‌కార్ట్ BBD సేల్‌లోనే లాంచ్.. ఫుల్ డిటెయిల్స్..!

Samsung Galaxy S24 : శాంసంగ్ నుంచి సరికొత్త 5G ఫోన్ రాబోతుంది. ఫ్లిప్‌కార్ట్ బీబీడీ సేల్ సమయంలో ఈ శాంసంగ్ గెలాక్సీ S24 లాంచ్ కానుంది.

Samsung Galaxy S24

Samsung Galaxy S24 : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో శాంసంగ్ కొత్త ఫోన్ రాబోతుంది. శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ లాంచ్ కు సంబంధించి (Samsung Galaxy S24) రివీల్ అయింది. రాబోయే ఫ్లిప్ కార్ట్ బీబీడీ సేల్ సమయంలో భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S24 లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3తో ​​కూడిన శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S24 5G ఫోన్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్న ఈ హ్యాండ్‌సెట్ ధర, స్పెసిఫికేషన్లతో పాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా టీజ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ అంబర్ ఎల్లో, కోబాల్ట్ వైలెట్, మార్బుల్ గ్రే, ఒనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో రానుంది. శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ S24 లాంచ్ తేదీ :
లిస్టింగ్ ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 వేరియంట్ సెప్టెంబర్ 23న ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సందర్భంగా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Read Also : Term Insurance Plan : భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులై.. జాయింట్ గా టర్మ్ పాలసీ తీసుకోవచ్చా? పెట్టుబడి ప్లానింగ్ ఎలా?

శాంసంగ్ గెలాక్సీ S24 ధర (అంచనా) :
ఈ ఫోన్ “త్వరలో రాబోతోంది” అనే బ్యానర్‌తో లిస్ట్ అయింది. 8GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ. 74,999, 8GB ర్యామ్ + 256GB ఆప్షన్ ధర రూ. 79,999 ఉండొచ్చు. అయితే, ఫ్లిప్‌కార్ట్ సేల్ పేజీలో BBD సేల్ సమయంలో గెలాక్సీ S24 5G ఫోన్ రూ. 40వేల లోపు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

హార్డ్‌వేర్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ అమెరికా మోడల్ మాదిరిగా కచ్చితమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల FHD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే కలిగి ఉంది.

హుడ్ కింద క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 అడ్రినో 750 జీపీయూ, 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత వన్ యూఐ7 రన్ అవుతుంది. శాంసంగ్ 7 ఏళ్ల వరకు OS అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది.

కెమెరా సెక్షన్ విషయానికి వస్తే.. స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ సెటప్‌ కలిగి ఉంటుంది. 50MP వైడ్ లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్ ఉండొచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP సెన్సార్‌ ఉంటుంది. ఇంకా, ఈ శాంసంగ్ ఫోన్ 4,000mAh బ్యాటరీతో 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.