Samsung Galaxy S25 FE 5G : 50MP కెమెరాతో ఈ శాంసంగ్ ఫోన్ జస్ట్ రూ. 22,000 తక్కువకే.. ఈ డీల్ మిస్ చేయొద్దు!
Samsung Galaxy S25 FE 5G : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ 5జీ ధర భారీగా తగ్గింది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,900mAh బ్యాటరీని అందిస్తుంది. పూర్తి ఆఫర్, డీల్ వివరాలివే..
- Sreehari A
- Published on- July 20, 2026 / 03:15 PM IST
Samsung Galaxy S25 FE 5G
- 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేతో వస్తుంది
- శాంసంగ్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది
- 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది
Samsung Galaxy S25 FE 5G : కొత్త శాంసంగ్ 5జీ ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్.. ప్రస్తుతం, 50MP ప్రైమరీ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరాతో అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,900mAh బ్యాటరీని అందిస్తుంది. కంపెనీ శాంసంగ్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్ కూడా ఉంది. శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ 5జీపై బెస్ట్ డీల్స్ ఆఫర్లను ఓసారి పరిశీలిద్దాం..
ధర, ఆఫర్లు :
ఈ శాంసంగ్ 5జీ ఫోన్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 45,299 ధరకు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే.. అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా పేమెంట్ చేస్తే.. రూ. 1358 తగ్గింపు లభిస్తుంది. తద్వారా ధర రూ. 43,941 అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ధర కన్నా సుమారు రూ. 22,300 తక్కువకే లభిస్తోంది.
మరోవైపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 35,050 వరకు అదనపు సేవింగ్ పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఎక్స్ఛేంజ్‌లో ఇచ్చే ఫోన్ ప్రస్తుత ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 2025లో రూ. 65,999 ధరకు లాంచ్ అయింది. దాని ప్రకారం.. రూ. 22వేలు తక్కువకు లభిస్తుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ ఫోన్ 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 1,900 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. శాంసంగ్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4,900mAh బ్యాటరీతో వస్తుంది. 45W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కొలతలు 161.3mm పొడవు, 76.6mm వెడల్పు, 7.4mm మందం, బరువు 190 గ్రాములు ఉంటుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ బ్యాక్ సైడ్ 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ టెలిఫోటో కెమెరా 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ, 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. జెనరేటివ్ ఎడిట్ వంటి ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్‌కు గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమిని లైవ్ ఇతర ఏఐ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ, 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
