Samsung Galaxy S25 FE : ఈ శాంసంగ్ ఫోన్ చాలా చీప్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 22,000 తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!
Samsung Galaxy S25 FE : శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ ఫోన్ రూ. 22వేలు తగ్గింపుతో కొనేసుకోవచ్చు. ఈ అదిరే డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- May 19, 2026 / 04:50 PM IST
Samsung Galaxy S25 FE
- శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే
- 50MP మెయిన్ కెమెరా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డులతో రూ. 2,300 తగ్గింపు
- 4,900mAh బ్యాటరీ, ఆఫర్లు, ధర, స్పెసిఫికేషన్లు, మరెన్నో ఆఫర్లు
Samsung Galaxy S25 FE : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? మీరు శాంసంగ్ లవర్స్ అయితే ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే.. ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ అదిరిపోయే ఆప్షన్. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈపై భారీ తగ్గింపు పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈలో 6.7-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో ఎక్సినోస్ 2400 ప్రాసెసర్ (Samsung Galaxy S25 FE) అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,900mAh బ్యాటరీ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈపై డీల్స్, ఆఫర్లు, ధర, స్పెసిఫికేషన్లు గురించి పూర్తి వివరాలతో తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ఫోన్ 8GB/256GB స్టోరేజ్ వేరియంట్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 45,999 ధరకు లిస్ట్ అయింది. సెప్టెంబర్ 2025లో 8GB/256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 65,999 ధరకు లాంచ్ అయింది.
బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ. 2,300 తగ్గింపు పొందవచ్చు. తద్వారా ధర రూ. 43,699 అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారు రూ. 22,300 తక్కువకే లభిస్తుంది. పాత లేదా ఇప్పటికే ఉన్న ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. 35,050 వరకు అదనపు సేవింగ్స్ పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ఫోన్ 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 1080×2340 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz, టాప్ బ్రైట్‌నెస్ 1,900 నిట్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8పై రన్ అవుతుంది.
కంపెనీ 7 ఏళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ అప్‌డేట్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో 4,900mAh బ్యాటరీ ఉంది. 45W వైర్డ్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. దుమ్ము, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ కూడా ఉంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
ఈ ఫోన్ జెనరేటివ్ ఎడిట్ వంటి ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్, అలాగే గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమిని లైవ్ ఇతర ఏఐ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. కొలతల ప్రకారం.. 161.3 మిమీ పొడవు, 76.6 మిమీ వెడల్పు, 7.4 మిమీ మందం, 190 గ్రాముల బరువు ఉన్నాయి.
