Samsung Galaxy S25 FE : వారెవ్వా.. అద్భుతమైన డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫోన్ చాలా చీప్ గురూ.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి!
Samsung Galaxy S25 FE : శాంసంగ్ లవర్స్ కోసం అదిరిపోయే ఫోన్. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ గెలాక్సీ S25 FEపై భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.
Samsung Galaxy S25 FE
- అత్యంత సరసమైన ధరకే కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా?
- రూ. 5వేలు తగ్గింపుతో శాంసంగ్ గెలాక్సీ S25 FE కొనేసుకోవచ్చు
- ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ గెలాక్సీ S25 FEపై అద్భుతమైన డీల్స్
Samsung Galaxy S25 FE : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ గెలాక్సీ S25 FEపై అద్భుతమైన డీల్ అందిస్తోంది. ఈ ఫోన్లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల డిస్ప్లే ఉంది.
8GB ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఫోన్లో 50MP మెయిన్ లెన్స్ ఉంది. ఇంతకీ, శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ధర ఎంత తగ్గింది? ఈ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ధర ఎంతంటే? :
8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 59,999 ధరకు లభిస్తుంది. ఈ ఫోన్‌పై రూ. 5,000 కూపన్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను రూ. 2,750 వరకు క్యాష్‌బ్యాక్‌తో సొంతం చేసుకోవచ్చు.
కంపెనీ రూ. 52,400 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ-O డైనమిక్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 2340×1080 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz, టాప్ బ్రైట్నెస్ 1900 నిట్స్ అందిస్తుంది.
డిస్ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్లో 8GB ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. 4nm ప్రాసెసర్‌తో ఎక్సినోస్ 2400 చిప్సెట్, శాంసంగ్ ఎక్లిప్స్ 940 జీపీయూతో వస్తుంది.
ఈ శాంసంగ్ ఫోన్ 4900mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ పరంగా 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బయోమెట్రిక్ సెక్యూరిటీకి ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ IP68 డస్ట్, వాటర్ ప్రొటెక్షన్ రేటింగ్‌తో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8పై రన్ అవుతుంది.
కెమెరాల విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 FEలో LED ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ లెన్స్, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 8MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో 5G SA/NSA, 4G VoLTE, Wi-Fi 6E 802.11ax (2.4/5GHz), బ్లూటూత్ 5.4, GPS + GLONASS, USB టైప్-C, 3.2 జెన్ 1, NFC ఉన్నాయి. ఈ ఫోన్ పవర్ఫుల్ సౌండ్ కోసం డాల్బీ అట్మోస్‌ను కూడా అందిస్తుంది.
