×
Ad

Samsung Galaxy S25 Plus : కొంటే శాంసంగ్ ఫోన్ కొనాలి, గెలాక్సీ S26 ప్లస్ రాగానే గెలాక్సీ S25 ప్లస్ ధర తగ్గిందోచ్, ఎంతంటే?

Samsung Galaxy S25 Plus : శాంసంగ్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్. కొత్త శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ కన్నా పాత గెలాక్సీ S25 ప్లస్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

  • Published On : February 26, 2026 / 04:28 PM IST

Samsung Galaxy S25 Plus

  • అమెజాన్‌లో భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్
  • రూ. 70వేల లోపు ధరలో గెలాక్సీ S25 ప్లస్ మోడల్
  • కొత్త శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ రాగానే డిస్కౌంట్

Samsung Galaxy S25 Plus : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. శాంసంగ్ ఫ్యాన్స్ కోసం భారత మార్కెట్లోకి సరికొత్త శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌ వచ్చేసింది. ఇందులో గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా మొత్తం 3 కొత్త ఫోన్లు ఉన్నాయి.

ఈ కొత్త శాంసంగ్ ఫోన్లు లాంచ్ అయిన వెంటనే పాత శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ధర భారీగా తగ్గింది. మీ బడ్జెట్ ధరలో శాంసంగ్ ఫోన్ కొనాలని చూస్తుంటే శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ కొనేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ :
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ అసలు ధర రూ.99,999 ఉండగా, 12GB ర్యామ్ వేరియంట్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అమెజాన్‌లో రూ.74,994కే లభిస్తుంది.  మీరు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో రూ.4వేల కూపన్‌తో పాటు అదనంగా రూ.1,500 తగ్గింపు పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ భారీ ధర (రూ. 1,19,999)కు లాంచ్ కాగా, శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ రూ. 70వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు.

Read Also : Credit Card Rules : షాకింగ్ న్యూస్.. క్రెడిట్ కార్డు కొత్త రూల్స్ ఇవే.. ఇకపై ఎలా పడితే అలా కార్డు గీకితే దొరికిపోతారు జాగ్రత్త..!

శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పాటు అడ్రినో 830 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 6.7-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. ఈ శాంసంగ్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అలాగే శాంసంగ్ 7 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు కూడా ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 12MP ఫ్రంట్ స్నాపర్‌తో వస్తుంది. 4900mAh బ్యాటరీ, 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది.