Samsung Galaxy S25 Ultra 5G : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5G ఫోన్‌పై రూ. 47వేలు తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే?
Samsung Galaxy S25 Ultra 5G : కొత్త ఫ్లాగ్‌షిప్ శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- July 28, 2026 / 09:46 PM IST
Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ ఫ్యాన్స్ ఎగిరిగంతేసే ఆఫర్.. మీ బడ్జెట్ రూ. 80వేల నుంచి రూ. 90 మధ్య కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది.
ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ 200MP కెమెరా ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీలో 5,000mAh బ్యాటరీ ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జీపై డీల్స్, ఆఫర్లు, స్పెసిఫికేషన్లను ఇప్పుడు చూద్దాం..
ధర, ఆఫర్లు : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 86,626 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై రూ. 4వేలు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ఫోన్ అసలు ధర రూ. 82,626కు తగ్గుతుంది. ఇప్పటికే ఉన్న లేదా పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా ధరను రూ. 58,700 వరకు తగ్గించుకోవచ్చు. గత ఏడాది జనవరిలో రూ. 1,29,999 ధరకు లాంచ్ అయిన ఈ ఫోన్ ధర ఇప్పుడు సుమారుగా రూ. 47,373 తక్కువకే లభిస్తోంది.
స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ 1400x3120 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. 6.9-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేతో వస్తుంది.
ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుగా 5,000mAh బ్యాటరీతో వస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందించారు.
కొలతల పరంగా పరిశీలిస్తే.. ఈ ఫోన్ 162.8 మిమీ పొడవు, 77.6 మిమీ వెడల్పు, 8.2 మిమీ మందం, 218 గ్రాముల బరువు ఉంటుంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, UWB, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
