Samsung Galaxy S25 Ultra 5G : ఐఫోన్‌కే టఫ్ ఇస్తున్న శాంసంగ్ S25 అల్ట్రా.. అమెజాన్ సేల్‌లో ధర వింటే షాక్ అవుతారు..!

Samsung Galaxy S25 Ultra 5G : అమెజాన్‌లో గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ధర భారీగా తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో సరసమైన ధరకు లభిస్తోంది. ఈ డీల్ వివరాలు ఇవే..

1/9
అమెజాన్‌లో సేల్ సమయంలో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ధర సరసమైన ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
2/9
Samsung Galaxy S25 Ultra 5G : అమెజాన్‌లో గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ధర భారీ తగ్గింపుతో లభిస్తుంది. భారత మార్కెట్లో రూ. 1,29,999 ధరకు లాంచ్ అయింది.
3/9
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 99,999కే అందుబాటులో ఉంది. అలాగే, క్యాష్‌బ్యాక్ బ్యాంక్ ఆఫర్‌లతో అర్హులైన కొనుగోలుదారులకు ధర రూ. 95వేల కన్నా తక్కువకు లభిస్తోంది.
4/9
అమెజాన్ లిస్టింగ్‌లో రూ. 2వేలు ముందస్తుగా కూపన్ కనిపిస్తోంది. అదనంగా, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో కస్టమర్‌లు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో రూ. 4,999 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అమెజాన్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌లను కూడా అందిస్తోంది. దాంతో కస్టమర్‌లు మరింత సరసమైన ధరకే కొనుగోలు చేయవచ్చు.
5/9
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ 12GB ర్యామ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐపై రన్ అవుతుంది. అనేక గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వస్తుంది. శాంసంగ్ ప్రకారం.. ఇది ఏఐ ఆధారిత చాట్స్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ‘నౌ బ్రీఫ్’ ఫీచర్ రిమైండర్‌లు, బ్యాటరీ ఇన్ఫో, షెడ్యూల్ అప్‌డేట్‌లను నేరుగా స్క్రీన్‌పై డిస్‌ప్లే చేస్తుంది.
6/9
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌లో 200MP ప్రైమరీ రియర్ కెమెరా, అల్ట్రా-వైడ్ టెలిఫోటో సెన్సార్లు ఉన్నాయి. ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం శాంసంగ్ ఏఐ ఆధారిత ప్రోవిజువల్ ఇంజిన్‌ కూడా ఇందులో ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ఎస్ పెన్ ఫంక్షనాలిటీకి సపోర్టు ఇస్తుంది.
7/9
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 12GB ర్యామ్‌తో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐపై రన్ అవుతుంది. అనేక గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఏఐ ఇంటరాక్షన్‌లకు సపోర్టు ఇస్తుంది. అలాగే ‘నౌ బ్రీఫ్’ఫీచర్ రిమైండర్‌లు, బ్యాటరీ ఇన్ఫో, షెడ్యూల్ అప్‌డేట్‌ నేరుగా ఇంటర్‌ఫేస్‌లోనే అందిస్తుంది.
8/9
ఈ ఫోన్ టైటానియం వైట్ సిల్వర్, టైటానియం బ్లాక్, టైటానియం గ్రే, టైటానియం సిల్వర్ బ్లూతో సహా అనేక కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కొనుగోలుదారులు ఎంపిక చేసిన కార్డ్‌లపై నెలకు సుమారు రూ. 8,333 నుంచి (12 నెలల పాటు) నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లను కూడా పొందవచ్చు.
9/9
సేల్‌లో భాగంగా అమెజాన్ యూజర్లకు 10 రోజుల సర్వీస్ సెంటర్ రీప్లేస్‌మెంట్ సపోర్ట్, ఫ్రీ డెలివరీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లపై అదనపు డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది.