Samsung Galaxy S25 Ultra 5G : ఈ శాంసంగ్ S25 అల్ట్రా క్రేజే వేరబ్బా.. రేటు ఎంతైనా తెగ కొంటున్నారు.. ధర జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. 200MP కెమెరాతో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/8
Samsung Galaxy S25 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది.
2/8
ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ రూ. 1,29,999 నుంచి తగ్గి రూ. 1,19,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ డీల్‌ కోసం HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐతో ప్రీమియం కొనుగోలుదారులు రూ.4,500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌, కెమెరా టెక్నాలజీ, అడ్వాన్స్ డిజైన్‌తో వస్తుంది.
3/8
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, అమోల్డ్ డిస్‌ప్లే : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ అందిస్తుంది. గేమ్‌లు, మల్టీ అప్లికేషన్‌లు, హై గ్రాఫిక్స్ సాఫ్ట్‌వేర్‌ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
4/8
ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే గరిష్టంగా 2600 నిట్స్ కారణంగా నేరుగా సూర్యకాంతి పడినా కంటెంట్‌ క్లియర్‌గా కనిపిస్తుంది.
5/8
200MP కెమెరా సెటప్ : ఈ ఫోన్ ఫొటోగ్రఫీ ప్రియులకు అద్భుతమైన ఫోన్. క్వాడ్-కెమెరా సిస్టమ్‌ అందిస్తుంది. ఈ సిస్టమ్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 200MP మెయిన్ సెన్సార్, 5x జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 3x జూమ్‌ అందించే 10MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.
6/8
ఈ కెమెరా సెటప్ హై క్వాలిటీ ఫొటోల కోసం జూమ్ ఫొటోగ్రాఫ్‌లు, అల్ట్రా-వైడ్ షాట్‌ అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా, వీడియో కాల్స్, కంటెంట్ క్రియేషన్‌కు సపోర్టుగా 4K వీడియో రికార్డింగ్‌ అందిస్తుంది.
7/8
ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీలో 5000mAh బ్యాటరీ ఉంది. ఎక్కువ వాడినా కూడా రోజంతా పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. అద్భుతమైన బ్యాటరీ పర్ఫార్మెన్స్‌తో వస్తుంది.
8/8
ధర తగ్గింపు, బ్యాంకు ఆఫర్లు : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో రూ. 1,19,999కే లభిస్తోంది. అసలు ధర రూ. 1,29,999 కాగా ఇప్పుడు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐతో కస్టమర్‌లు రూ. 4,500 ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ పొందవచ్చు. తద్వరా ధర మరింత తగ్గుతుంది.