Samsung Galaxy S25 Ultra : కొంటే శాంసంగ్ అల్ట్రా ఫోన్ కొనాలి.. ఇంత తక్కువ ధరలో మళ్లీ దొరకదు.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. కొనాలని అనుకుంటే ఈ సేల్ సమయంలోనే కొనేసుకోవడం బెటర్. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకే లభించనుంది.
- Sreehari A
- Published on- May 4, 2026 / 08:58 PM IST
Samsung Galaxy S25 Ultra
- శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ భారీగా తగ్గింపు
- గతంలో కన్నా అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు
- శాంసంగ్ ఫోన్ ప్రారంభ ధర రూ. 1,29,999కు లాంచ్
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర భారీగా తగ్గింది. గత ఏడాదిలో లాంచ్ అయిన ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పటివరకు ఎన్నడూ లేనంత తక్కువ ధరకు లభిస్తోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్, రాబోయే సేల్‌కు ముందు గెలాక్సీ S25 అల్ట్రాపై భారీ డీల్స్‌ను వెల్లడించింది.
ఈ శాంసంగ్ ఫోన్ ప్రారంభ ధర కన్నా రూ. 35వేల వరకు తక్కువకే ఇంటికి తెచ్చుకోవచ్చు. అమెజాన్‌లో (Samsung Galaxy S25 Ultra) ఈ సేల్ మే 8వ తేదీన ప్రారంభం కానుంది. అమెజాన్ సేల్‌లో ఈ శాంసంగ్ ఫోన్‌పై ధర తగ్గింపుతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ వంటి బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. శాంసంగ్ ఈ ఫోన్‌ను రూ. 1,29,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.
అమెజాన్‌లో మే 8 నుంచి మెగా సేల్‌లో శాంసంగ్ ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 94,999 ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ఫోన్ ధరపై రూ. 35వేలు9 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. 10శాతం వరకు అదనపు డిస్కౌంట్ లేదా క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫీచర్లు
ఈ శాంసంగ్ ఫోన్ 6.9-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2x డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ రిజల్యూషన్ 1440×3120 పిక్సెల్స్ అందిస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 200MP మెయిన్ కెమెరా ఉంది. ఇందులో 50MP అల్ట్రా-వైడ్ 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్‌లో 50MP నాల్గో కెమెరా కూడా అద్భుతంగా ఉంది.
సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12MP వైడ్-యాంగిల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 45W వైర్డ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్‌యూఐ 6పై రన్ అవుతుంది. ఈ ఫోన్ వాటర్ డస్ట్‌ప్రూఫ్ కూడా అందిస్తుంది.
6.9-అంగుళాల AMOLED, 120Hz
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్
12GB, 512GB
5000mAh, 45W
200MP + 50MP + 10MP + 50MP, 12MP
ఆండ్రాయిడ్ 15, వన్‌యూఐ
