Samsung Galaxy S26 FE : 50MP ట్రిపుల్ కెమెరా, భారీ బ్యాటరీ.. శాంసంగ్ కొత్త ఫోన్‌పై భారీ అంచనాలు!
Samsung Galaxy S26 FE : ఈ శాంసంగ్ ఫోన్‌లో 50MP రియర్ కెమెరా ఉంటుందని అంచనా. శాంసంగ్ ఐసోసెల్ S5KGN3 సెన్సార్ పవర్ అందిస్తుందని అంచనా.. పూర్తి ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- August 2, 2026 / 08:20 PM IST
Samsung Galaxy S26 FE
- శాంసంగ్ ఫోన్ R14 ఇంటర్నల్ కోడ్ పేరుతో ప్రత్యక్షం
- ఈ ఫోన్‌లో 50MP రియర్ మెయిన్ కెమెరా ఉంది
- శాంసంగ్ ఐసోసెల్ S5KGN3 సెన్సార్ ఉంటుంది
Samsung Galaxy S26 FE : శాంసంగ్ గెలాక్సీ S26 FE అనేది ఆ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్, ఇది త్వరలో విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ఇప్పటికే భారతీయ ధృవీకరణను పొందింది మరియు ఒక BIS జాబితాలో కనిపించింది. ఇప్పుడు, దాని కెమెరా స్పెసిఫికేషన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం వెల్లడైంది.
ఈ ఫోన్‌లో బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా ఉంటుందని అంచనా. ఈ కెమెరాలో శాంసంగ్ సొంత పవర్‌ఫుల్ సెన్సార్ వాడినట్టు చెబుతున్నారు. కంపెనీ గెలాక్సీ S24 ఎఫ్ఈ, గెలాక్సీ S25 ఎఫ్ఈలో కూడా వాడారు. శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈ ఇతర ఫీచర్లపై ఓసారి పరిశీలిద్దాం..
శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈ త్వరలో మార్కెట్లోకి రావచ్చు. ఈ ఫోన్ లాంచ్ ముందే కెమెరా స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. ఆండ్రాయిడ్ అథారిటీ రిపోర్టు ప్రకారం.. ఈ ఫోన్ ఇంటర్నల్ కోడ్‌నేమ్ R14గా రివీల్ అయింది. ఈ ఫోన్‌లో 50MP రియర్ మెయిన్ కెమెరా ఉండొచ్చు.
ఇందులో శాంసంగ్ ఐసోసెల్ S5KGN3 సెన్సార్ ఉంటుంది. 1µm పిక్సెల్‌లకు సపోర్ట్ చేసే 1/1.57-అంగుళాల సెన్సార్ అందిస్తుంది. దీనికి ఎఫ్/1.8 అపెర్చర్ కూడా ఉంది. ఫోకల్ లెంగ్త్ 24mmగా ఉంటుందని అంచనా. ఈ ఫోన్‌లో డ్యూయల్ పిక్సెల్ ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్ ఉంది. కంపెనీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా అందించవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ కీలక ఫీచర్లు లీక్ :
ఈ ఫోన్‌లో 8MP టెలిఫోటో కెమెరా ఉంటుందని అంచనా. ఓమ్నివిజన్ OV08A1 సెన్సార్‌ను అమర్చుతారు. 3x వరకు ఆప్టికల్ జూమ్‌కు సపోర్టు ఇస్తుంది. దీనికి ఎఫ్/2.4 అపెర్చర్ ఉంటుందని అలాగే OISకు కూడా సపోర్టు ఇస్తుందని అంటున్నారు.
ఈ ఫోన్‌లో అదనంగా మరో రెండు 12MP సెన్సార్లు ఉంటాయి. ఇందులో ఒకటి అల్ట్రావైడ్ కెమెరా కాగా, మరొకటి సెల్ఫీ కెమెరా కావచ్చు. సెల్ఫీ కెమెరాలో IMX825 సెన్సార్, అల్ట్రావైడ్ కెమెరాలో GC12A2 సెన్సార్‌ను అమర్చవచ్చు.
నివేదిక ప్రకారం..
ఈ ఫోన్‌లోని అన్ని కెమెరాలు 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. అయితే, మెయిన్ కెమెరా 30fps వద్ద 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు.. ఈ ఫోన్‌లో ప్రాసెసర్‌గా శాంసంగ్ సొంత ఎక్సినోస్ 2500 చిప్‌సెట్‌తో రానుంది. 3nm ప్రాసెసింగ్‌పై రన్ అవుతుంది.
ఈ ఫోన్‌లో 4900mAh బ్యాటరీ ఉంటుంది. కంపెనీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే ఉండవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో రావచ్చు. ఈ స్పెసిఫికేషన్లపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
