Samsung Galaxy S26 FE : శాంసంగ్ లవర్స్ రెడీనా? అత్యంత చౌకైన గెలాక్సీ S26 వచ్చేస్తోంది.. ఫీచర్లు మాత్రం ఫ్లాగ్‌షిప్ రేంజ్!
Samsung Galaxy S26 FE : శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈ త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ గతంలో గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఇప్పుడు, మరో సర్టిఫికేషన్ సైట్‌లో కూడా కనిపించింది. కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.
- Sreehari A
- Updated on- June 8, 2026 / 04:58 PM IST
Samsung Galaxy S26 FE
- అత్యంత చౌకైన శాంసంగ్ S26 సిరీస్ వచ్చేస్తోంది
- గెలాక్సీ S26 సిరీస్‌లో ఇప్పటికే మూడు మోడళ్లు లాంచ్
- శాంసంగ్ గెలాక్సీ S25 FEతో పోలిస్తే మరెన్నో అప్‌గ్రేడ్‌లు
Samsung Galaxy S26 FE : శాంసంగ్ లవర్స్ గెట్ రెడీ.. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌లో అత్యంత చౌకైన ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇటీవల WPC డేటాబేస్‌లో కనిపించింది. ఈ శాంసంగ్ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి.
దక్షిణ కొరియా కంపెనీకి చెందిన ఈ ‘ఫ్యాన్ ఎడిషన్ (FE)’ స్మార్ట్‌ఫోన్ రాబోయే వారాల్లో భారత్ సహా ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ చేయనున్నట్టు భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ గెలాక్సీ S26 సిరీస్‌లో 3 మోడళ్లను లాంచ్ చేయగా ఈ సిరీస్‌లో నాలుగో మోడల్ త్వరలో రాబోతుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలను ఇప్పుడు చూద్దాం..
వైర్‌లెస్ డేటాబేస్‌లో లిస్టింగ్ :
శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈ వైర్‌లెస్ పవర్ కన్సార్టియం (WPC) డేటాబేస్‌లో కనిపించింది. నివేదిక ప్రకారం.. రాబోయే ఈ శాంసంగ్ ఫోన్ SM-S741 అనే మోడల్ నంబర్‌తో వస్తుంది. అయితే, ఈ సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్ ఫోన్ వివరాలు వెల్లడించలేదు. ఈ ఫోన్ Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం సర్టిఫికేషన్ పొందింది. 5W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఈ సిరీస్‌లో రాబోయే శాంసంగ్ ఫోన్ ఇతర మోడళ్ల మాదిరిగానే డిస్‌ప్లే, డిజైన్‌తో వస్తుంది. గత ఏడాదిలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈతో పోలిస్తే అనేక అప్‌గ్రేడ్‌లు ఉంటాయి. రాబోయే ఫోన్ డిస్‌ప్లే, ప్రాసెసర్, స్టోరేజ్, కెమెరాలో అప్‌గ్రేడ్‌లు పొందవచ్చు. నివేదికల ప్రకారం.. ఈ శాంసంగ్ ఫోన్‌లో మరిన్ని అప్‌గ్రేడ్‌లన్నీ ఉండవచ్చు.
12GB ర్యామ్ ఆప్షన్ :
గతంలో శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈ ఫోన్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్ ఎక్సినోస్ 2600 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. అదనంగా, ఈ ఫోన్ 12GB ర్యామ్, ఆండ్రాయిడ్ 17పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేయవచ్చు. శాంసంగ్ ఫోన్ కెమెరాకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.
శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫీచర్లు :
గత ఏడాదిలో లాంచ్ అయిన శాంసంగ్ మోడల్‌లో 6.7-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. కంపెనీ ఇందులో ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ అందిస్తుంది. 8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 4,900mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 45W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
