Samsung Galaxy S26 Ultra 5G : గేమింగ్, ఫొటోగ్రఫీకి బెస్ట్ ఫోన్.. శాంసంగ్ అల్ట్రా 5Gపై అద్భుతమైన డిస్కౌంట్.. ధర జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy S26 Ultra 5G : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీపై ఫ్లాట్ 17శాతం తగ్గింపు లభిస్తోంది. ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

Samsung Galaxy S26 Ultra 5G

  • శాంసంగ్ ప్రీమియం అల్ట్రాపై భారీ తగ్గింపు ఆఫర్
  • 200MP కెమెరా, 12GB ర్యామ్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్
  • బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో మరింత తగ్గింపు

Samsung Galaxy S26 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా? అయితే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ప్రస్తుతం అసలు ధరపై సుమారు 17శాతం భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

ఈ ఫోన్‌లో 200MP కెమెరా, 12GB వరకు ర్యామ్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 వంటి కొన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ అనేక బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో వస్తుంది. తద్వారా ధర మరింత తగ్గుతుంది. ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఈ డీల్‌ను పూర్తిగా పరిశీలిద్దాం..

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5Gపై డిస్కౌంట్ :
ఈ శాంసంగ్ ఫోన్ ప్రారంభ ధర రూ. 139,999 కాగా, ప్రస్తుతం అమెజాన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో కేవలం రూ. 116,490కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై మీరు 17శాతం వరకు డైరెక్ట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, ఈ డివైస్‌పై అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.

Read Also : Vivo S60 Launch : వివో లవర్స్‌కు పండగే.. కొత్త వివో S60 వచ్చేస్తోంది.. భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లు!

అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 3,494 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. ఈ ఫోన్‌ను ‘నో-కాస్ట్ ఈఎంఐ’ ఆప్షన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. తద్వారా నెలకు ఈఎంఐ రూ. 3,036 చెల్లించాల్సి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ స్పెసిఫికేషన్లు :
స్పెసిఫికేషన్ల పరంగా పరిశీలిస్తే.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5జీ ఫోన్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇంటర్నల్ ప్రైవసీ డిస్‌ప్లేతో వచ్చిన ప్రపంచంలోనే ఫస్ట్ ఫోన్ కూడా ఇదే.

అద్భుతమైన 6.9-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, అప్‌గ్రేడ్ 200MP కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. అంతేకాదు.. రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్ ఆన్-డివైస్ ‘ఏజెంటిక్ ఏఐ టూల్స్ కూడా అందిస్తుంది.