Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ లవర్స్‌కు పండగే.. ఇలా కొన్నారంటే గెలాక్సీ S26 అల్ట్రా సగం రేటుకే.. నెలకు రూ. 749 EMI
Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ అభిమానుల కోసం కొత్త గెలాక్సీ ఫరెవర్ ప్రొగ్రామ్ అందిస్తోంది. ఈ ప్రొగ్రామ్ కింద శాంసంగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు కొనేవారు సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Published On : March 20, 2026 / 12:45 PM IST
Samsung Galaxy S26 Ultra
- శాంసంగ్ గెలాక్సీ ఫరెవర్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టిన సౌత్ కొరియన్ దిగ్గజం
- ముందుగా సగం ధర మాత్రమే చెల్లించి మిగతాది ఈఎంఐలో చెల్లించండి
- ఏడాది తర్వాత, ఫోన్ వాపసు ఇవ్వొచ్చు.. లేదంటే కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోండి
- శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా, గెలాక్సీ S26 ప్లస్ తక్కువ ధరకే
Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ 50 శాతం డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. భారతీయ యూజర్ల కోసం శాంసంగ్ ‘గెలాక్సీ ఫరెవర్’ అనే కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చింది.
మీరు ఫస్ట్ ఏడాది కేవలం 50 శాతం మాత్రమే చెల్లించి గెలాక్సీ S26 అల్ట్రా లేదా గెలాక్సీ S26 ప్లస్‌ను సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని తర్వాత చెల్లించవచ్చు. మీరు ఫోన్‌ను తిరిగి ఇచ్చేస్తే.. ఆ పేమెంట్ కట్టన్కర్లేదు.
ఫ్లాగ్‌షిప్ ఫోన్లను కొనేవారికి ఈ ఆఫర్ అద్భుతంగా ఉంటుంది. గెలాక్సీ S26 అల్ట్రా లేదా గెలాక్సీ S26 ప్లస్‌ను అసలు ధరలో సగం ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గెలాక్సీ ఫరెవర్ ఏంటి? :
శాంసంగ్ గెలాక్సీ ఫరెవర్ అనేది ఫ్లాగ్‌షిప్ డివైజ్ ల కోసం ప్రవేశపెట్టిన కొత్త మేనేజ్ మెంట్ పాలసీ. ఈ ప్రోగ్రామ్ కింద వినియోగదారులు 12 నో-కాస్ట్ ఈఎంఐల ద్వారా డివైజ్ ధరలో సగం చెల్లించి గెలాక్సీ S26 అల్ట్రా లేదా గెలాక్సీ S26 ప్లస్‌ను ఇంటికి తీసుకువెళ్లవచ్చు. ఈ ప్లాన్‌లో రూ. 13,999 విలువైన శాంసంగ్ కేర్ ప్లస్ ప్రొటెక్షన్ 13 నెలల పాటు కూడా లభిస్తుంది. ప్రమాదవశాత్తు ఈ ఫోన్ నీళ్లలో పడినా ఆ నష్టాన్ని అదనపు ఛార్జీలు లేకుండా కవర్ చేస్తుంది.
అంతేకాదు.. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం కొనుగోలుదారులకు ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను కూడా అందిస్తోంది. అంటే.. ఈ ఫోన్‌ను వాపసు ఇచ్చేయొచ్చు. లేదంటే మిగిలిన మొత్తాన్ని చెల్లించి ఫోన్‌ను ఉంచుకోవచ్చు. కొత్త గెలాక్సీ ఫ్లాగ్‌షిప్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
గెలాక్సీ ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుందంటే? :
గెలాక్సీ ఫరెవర్ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. శాంసంగ్ యూజర్లు తమ ఫోన్ ధరలో 50 శాతాన్ని క్రెడిట్ కార్డ్, శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్ ద్వారా చెల్లించాలి. ఆ తర్వాత, ఆ మొత్తాన్ని 12 నో-కాస్ట్ ఈఎంఐలుగా మార్చుకోవాలి. సుమారు రూ. 749 నెలవారీ ప్రోగ్రామ్ ఫీజుతో పాటు చెల్లించాల్సి ఉంటుంది.
12 నెలల గడువు దాటాక కొన్ని ఆప్షన్లు ఉంటాయి. క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ శాంసంగ్ తిరిగి ఇచ్చి గ్యారెంటెడ్ 50 శాతం బైబ్యాక్ వాల్యూను కూడా పొందవచ్చు. మిగిలిన 50 శాతాన్ని మరో 12 నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా చెల్లించి ఫోన్ మీ వద్దే ఉంచుకోవచ్చు.
మీ శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఫోన్ శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్ ఉపయోగించి కొనుగోలు చేస్తే కొత్త గెలాక్సీ మోడల్ రాగానే ఆ ఫోన్ వాపసు ఇచ్చి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అయితే, మీరు అలా వద్దనుకుంటే 13వ నెలలో మిగిలిన పూర్తి మొత్తాన్ని చెల్లించి ఆ ఫోన్ ఉంచుకోవచ్చు.
ధర, డీల్ వివరాలు :
ఈ ప్రోగ్రామ్ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో భారత మార్కెట్లో 1,500కు పైగా శాంసంగ్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. అంతేకాదు.. రిటర్న్‌లు, అప్‌గ్రేడ్‌లు, సెటిల్‌మెంట్ కోసం శాంసంగ్, సర్విఫై, డిఎమ్ఐ ఫైనాన్స్‌తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ధరల విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అధికారికంగా రూ. 1,39,999 నుంచి ప్రారంభమవుతుంది. ప్రోగ్రామ్ ఫీజుతో సహా నెలకు సుమారు రూ. 6,583 చెల్లించాల్సి ఉంటుంది. గెలాక్సీ S26 ప్లస్ రూ. 1,19,999 నుంచి ప్రారంభమవుతుంది. నెలకు సుమారు రూ. 5,750 ఖర్చవుతుంది.
మీరు గెలాక్సీ ఫరెవర్‌ను ఎంచుకోవాలా? :
శాంసంగ్ ప్రోగ్రామ్‌తో 50 శాతం మొత్తాన్ని ముందుగా చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని 12 నెలల ఈఎంఐ ద్వారా చెల్లించవచ్చు. 12 నెలల తర్వాత డివైజ్‌ను అప్‌గ్రేడ్ చేయాలా లేదా ఉంచుకోవాలా అని నిర్ణయించుకునే అవకాశాన్ని శాంసంగ్ మీకు ఇస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఫరెవర్ ప్రోగ్రామ్‌లో 12 నెలల తర్వాత మీరు వద్దనుకుంటే ఫోన్ తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లో శాంసంగ్ కేర్ ప్లస్ కూడా ఉంది. ప్రమాదవశాత్తు లేదా వాటర్ కారణంగా పాడవుతుందనే ఆందోళన ఉండదు. గూగుల్ పిక్సెల్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లో ఈ సౌకర్యం లేదు.
