Samsung Galaxy S26 Ultra : వారెవ్వా మాస్ డీల్.. ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ చాలా చవక.. ఎందుకు కొనాలంటే?
Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ప్లాట్‌ఫారంపై ఏకంగా రూ. 28వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఇంతకీ ఈ డిస్కౌంట్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- July 11, 2026 / 06:37 PM IST
Samsung Galaxy S26 Ultra
- ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రాపై భారీ డిస్కౌంట్
- ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో అదనంగా రూ. 4వేలు తగ్గింపు
- 50MP టెలిఫోటో, 3x ఆప్టికల్ జూమ్, 10MP టెలిఫోటో సెన్సార్
Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలో లాంచ్ అయిన అద్భుతమైన ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఒకటి. కొత్త డిజైన్, క్వాడ్ కెమెరా సెటప్, అత్యాధునిక ప్రాసెసర్, ఏఐ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం మెమరీ చిప్‌ల ఖర్చు పెరగడంతో చాలా కంపెనీలు స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెంచేశాయి. కానీ, ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధర భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్టులో ఈ శాంసంగ్ ఫోన్ భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లకు సంబంధించి ఓసారి పరిశీలిద్దాం..
ఫ్లిప్‌కార్ట్‌లో గెలాక్సీ S26 అల్ట్రాపై డిస్కౌంట్ :
256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 12GB ర్యామ్ వేరియంట్ అందిస్తుంది. భారత మార్కెట్లో అసలు ధర రూ. 1,39,999 ఉండగా ప్రస్తుతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,15,988 ధరకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి ఈ ఫోన్‌పై అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా ధర మరింత తగ్గి రూ. 1,11,988 అవుతుంది.
గెలాక్సీ S26 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రాలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల QHD+ డైనమిక్, అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే ఉంది. ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ ప్రకారం.. అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం ఈ ప్రాసెసర్‌ను క్వాల్‌కామ్‌తో స్పెషల్‌గా ఆప్టిమైజ్ అయింది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. :
శాంసంగ్ గెలాక్సీS26 అల్ట్రాలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. వైడ్ అపెర్చర్‌తో 200MP ప్రైమరీ షూటర్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఈ సెటప్‌లో 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 10x ఆప్టికల్-క్వాలిటీ జూమ్‌తో 50MP టెలిఫోటో సెన్సార్ 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో సెన్సార్ కూడా ఉంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో 12ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా 5,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ లేటెస్ట్ వన్ యూఐతో వస్తుంది.
