Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా భారీగా తగ్గిందోచ్.. ఇలా కొన్నారంటే ఇంకా తక్కువ ధరకే!

Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ రూ. 13వేలు తగ్గింపుతో కొనేసుకోవచ్చు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

1/7
Samsung Galaxy S26 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ ధర భారీగా తగ్గింది. 2026లో లాంచ్ అయిన అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి.
2/7
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో పాటు పవర్‌ఫుల్ కెమెరా సిస్టమ్ మరెన్నో ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం..
3/7
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ధర తగ్గింపు : 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 12GB ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ. 1,59,999 నుంచి తగ్గింది. అమెజాన్ ఇండియాలో రూ. 1,50,999కే అందుబాటులో ఉంది. అంతేకాదు, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లందరికి అదనంగా రూ. 4,529 అమెజాన్ పే బ్యాలెన్స్ లభిస్తుంది. తద్వారా ధర మరింత తగ్గి రూ. 146,470కు లభిస్తుంది.
4/7
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.9-అంగుళాల QHD+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేతో వస్తుంది.
5/7
ఈ శాంసంగ్ గెలాక్సీ కోసం కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం క్వాల్‌కామ్‌తో ఈ ప్రాసెసర్‌ ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేసినట్లు శాంసంగ్ పేర్కొంది.
6/7
కెమెరాల విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రాలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200MP ప్రైమరీ షూటర్ మెయిన్ అట్రాక్షన్. తక్కువ కాంతిలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం వైడర్ అపర్చర్ ఉంది. ఈ సెటప్‌లో 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 10x ఆప్టికల్-క్వాలిటీ జూమ్‌తో 50MP టెలిఫోటో సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.
7/7
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. గెలాక్సీ ఎస్26 అల్ట్రా 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ లేటెస్ట్ వన్ యూఐ ఉంటుంది. ఇతర ఫీచర్లలో 5జీ సపోర్ట్, Wi-Fi 7 కనెక్టివిటీ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ ఉన్నాయి.