Samsung Phones : వారెవ్వా.. ఆఫర్లు అదుర్స్.. ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఇలా కొన్నారంటే..!

Samsung Phone Deals : శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ A57 ఫోన్లు భారీ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. మే 4వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు శాంసంగ్ లైనప్‌లో ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

Samsung Phones

  • మే 4వ తేదీ నుంచి మే 27 వరకు లిమిటెడ్ ఆఫర్
  • శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రాపై రూ. 9వేలు భారీ తగ్గింపు
  • ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అద్భుతమైన డీల్స్

Samsung Phones : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్. మే 4వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు శాంసంగ్ తమ లైనప్‌లోని ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ధర తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ లైనప్‌లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్‌లైన శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌తో పాటు మిడ్-రేంజర్ శాంసంగ్ A37, A57 ఫోన్లు (Samsung Phones) కూడా ఉన్నాయి. ఎలాంటి కార్డ్ ఆధారిత ఆఫర్లు లేదా ఎక్స్ఛేంజ్ లేకుండా అందుబాటులో ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ S26 :
ఈ లిస్టులో మొదటగా ఈ ఏడాది లాంచ్ సాధారణ శాంసంగ్ గెలాక్సీ S26 ఉంది. ఈ డివైస్ 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్‌లు రెండింటిపైనా ఫ్లాట్‌గా రూ. 8వేలు ధర తగ్గింపు లభించనుంది.

12GB + 256GB రూ. 87,999 రూ. 79,999
12GB + 512GB రూ. 1,07,999 రూ. 99,999

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా :
ఈ లిస్టులో తర్వాతి స్థానంలో పవర్ ఫుల్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఉంది. ఈ లైనప్‌లో శాంసంగ్ ఫోన్ అత్యధిక తగ్గింపు ఉంది. మీరు ఇప్పుడు ఈ డివైజ్‌ 3 వేరియంట్‌లైన 12GB/256GB, 12GB/512GB, 16GB/1TBలపై రూ. 9వేల తగ్గింపుతో పొందవచ్చు.

Read Also : iQOO Z11 Series : ఐక్యూ లవర్స్ కోసం కొత్త సిరీస్ వస్తోంది.. ఈ నెల 6నే గ్లోబల్ లాంచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫుల్ డిటెయిల్స్!

12GB + 256GB రూ. 1,39,999 రూ. 1,30,999 ( కొత్త ధర)
12GB + 512GB రూ. 1,59,999 రూ. 1,50,999 ( కొత్త ధర)
16GB + 1TB రూ. 1,89,999 రూ. 1,80,999 ( కొత్త ధర)

శాంసంగ్ గెలాక్సీ A37 :
మిడ్ రేంజ్ ఫోన్ల విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A37 ఫోన్ 3 వేరియంట్‌లైన 8GB/128GB, 8GB/256GB, 12GB/256GB రూ. 5వేల ధర తగ్గింపు అందిస్తుంది. ఈ డీల్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

8GB + 128GB రూ. 41,999 రూ. 36,999 ( కొత్త ధర)
8GB + 256GB రూ. 47,499 రూ. 42,499 ( కొత్త ధర)
12GB + 256GB రూ. 52,499 రూ. 47,499 ( కొత్త ధర)

శాంసంగ్ గెలాక్సీ A57 :
శాంసంగ్ గెలాక్సీ A57 డివైస్ 8GB/256GB, 12GB/256GB వేరియంట్లు రెండూ రూ. 7,000 తగ్గింపుతో పొందవచ్చు.

8GB + 256GB రూ. 56,999 రూ. 49,999 (కొత్త ధర)
12GB + 256GB రూ. 62,499 రూ. 55,499 (కొత్త ధర)

ఈ డీల్ మే 4వ తేదీ నుంచి ప్రారంభమై మే 27వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ధర డిస్కౌంట్లు ఎలాంటి కార్డ్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్ల అవసరం ఉండదు.