Samsung Galaxy S26 Series
Samsung Galaxy S26 Series : శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో గెలాక్సీ S26 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. కొత్త లైనప్‌లో మొత్తం 3 మోడళ్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, కెమెరా ఫీచర్లలో అప్‌గ్రేడ్‌లను అందించనుంది.
ఈ శాంసంగ్ ఫోన్‌లతో పాటు శాంసంగ్ కొత్త గెలాక్సీ బడ్స్ 4 సిరీస్‌ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. మీరు రాబోయే స్మార్ట్‌ఫోన్లలో ఏదైనా ఒకటి కొనుగోలు చేయొచ్చు. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ధరలపై అంచనాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా ధర (అంచనా) :
లీక్‌ల ప్రకారం.. స్టాండర్డ్ గెలాక్సీ S26 ధర భారత మార్కెట్లో రూ.79,999, రూ.82,999 మధ్య ఉండవచ్చు. గెలాక్సీ S26 ప్లస్ ధర దాదాపు రూ.99,999 ఉంటుందని భావిస్తున్నారు. టాప్-ఎండ్ గెలాక్సీ S26 అల్ట్రా ధర రూ.1,29,999 నుంచి ప్రారంభమవవచ్చు. అల్ట్రా మోడల్ హై స్టోరేజ్ వేరియంట్లు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ బట్టి దాదాపు రూ.1.7 లక్షల వరకు ఉండవచ్చు.
భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్ తేదీ :
ఫిబ్రవరి 25న శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే గెలాక్సీ అన్ ప్యాకడ్ 2026 ఈవెంటులో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ అధికారికంగా లాంచ్ కానుంది. భారతీయ కస్టమర్లు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్‌లో రాత్రి 11:30 గంటలకు లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే QHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌పై రన్ అవుతుందని భావిస్తున్నారు. 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది.
ఈ ఫోన్ 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందించనుంది. కెమెరాల విషయానికొస్తే.. అల్ట్రా మోడల్‌లో 200MP ప్రైమరీ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్ ఉండవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల QHD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ఎక్సినోస్ 2600 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది. 45W ఛార్జింగ్‌తో 4,900mAh బ్యాటరీ అందించనుంది. రియర్ కెమెరా సెటప్‌లో 50MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్ ఉండవచ్చు.
స్టాండర్డ్ గెలాక్సీ S26 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. అదే ఎక్సినోస్ చిప్‌సెట్, 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో రావచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ 25W ఛార్జింగ్‌తో 4,300mAh బ్యాటరీ, ప్లస్ మోడల్ మాదిరిగానే ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో బ్యాకప్ చేయొచ్చు.