Samsung Galaxy Z Flip 6 : వారెవ్వా ఆఫర్ అదిరింది.. ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్ మీ బడ్జెట్ ధరలో.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy Z Flip 6 : శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ భారీ తగ్గింపు ధరతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 18వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

  • Published On : February 28, 2026 / 01:38 PM IST
1/7
Samsung Galaxy Z Flip 6 : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? మీకు శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ కావాలంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
2/7
ప్రస్తుతం ఈ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో రూ.18వేల కన్నా ఎక్కువ భారీ తగ్గింపును అందిస్తోంది. భారత మార్కెట్లో రూ.1,09,999 ధరకు లాంచ్ అయిన జెడ్ ఫ్లిప్ 6 ప్రీమియం డిజైన్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, గెలాక్సీ ఏఐ ఫీచర్లతో పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
3/7
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 డీల్ : భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ఫోన్ రూ.1,09,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.95,000కి లిస్ట్ అయింది. రూ.14,999 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.
4/7
అలాగే, మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సస్,ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి పేమెంట్ చేయడం ద్వారా రూ.4వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
5/7
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ఫోన్ 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X ఇన్నర్ స్క్రీన్‌తో వస్తుంది. FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. బయటి వైపున 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 3.4-అంగుళాల సూపర్ అమోల్డ్ కవర్ డిస్‌ప్లే ఉంది.
6/7
హుడ్ కింద, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇంకా, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,000mAh బ్యాటరీతో వస్తుంది.
7/7
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ 10MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.