Samsung: మీ కల నిజమయ్యే సమయం.. ఈ శాంసంగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో అతిపెద్ద ఆఫర్..

ఈ డీల్ ఎవరికి నచ్చుతుంది?

Samsung Galaxy Z Flip 6

ఫోల్డబుల్ ఫోన్ కొనాలనే మీ కల ఇప్పుడు నిజం కాబోతోంది. స్టైల్, టెక్నాలజీకి ప్రతిరూపమైన Samsung Galaxy Z Flip 6 పై అమెజాన్ ఒక నమ్మశక్యం కాని ఆఫర్‌ను ప్రకటించింది.

ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌పై ఏకంగా రూ.40,000కు పైగా ఆదా చేసుకునే సువర్ణావకాశం ఇది. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఇంత తక్కువ ధరకు సొంతం చేసుకునే డీల్స్ చాలా అరుదుగా వస్తాయి. ఈ డీల్ పూర్తి వివరాలు, ఫోన్ ఫీచర్లు, ఇది మీకు సరైనదేనా? కాదా? అన్న వివరాలు చూడండి..

రూ.40,250 ఎలా ఆదా చేసుకోవాలి?

ఈ భారీ తగ్గింపును ఎలా పొందాలో ఇక్కడ దశలవారీగా చూడండి..

అసలు ధర (MRP): రూ.1,09,999

అమెజాన్ ఫ్లాట్ డిస్కౌంట్ (రూ.36,000 తగ్గింపు): దీంతో ధర రూ.73,999

బ్యాంక్ ఆఫర్: HSBC క్రెడిట్ కార్డ్ EMI ద్వారా అదనంగా రూ.4,250 వరకు తగ్గింపు.

మొత్తం ఆదా: రూ.36,000 (ఫ్లాట్) + రూ.4,250 (బ్యాంక్ ఆఫర్) = రూ.40,250

గమనిక: బ్యాంక్ ఆఫర్లు, స్టాక్ పరిమితంగా ఉంటాయి. ఇలాంటి డీల్స్ కొన్ని గంటల్లోనే ముగిసిపోయే అవకాశం ఉంది, కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఫీచర్లు అదుర్స్

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు, Galaxy Z Flip 6 ఒక శక్తిమంతమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్.

6.7-అంగుళాల ప్రధాన AMOLED 2X డిస్‌ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్‌తో, వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడటానికి బాగుంటుంది.

3.4-అంగుళాల పెద్ద కవర్ డిస్‌ప్లే: ఫోన్ తెరవకుండానే నోటిఫికేషన్లు చూడటం, కాల్స్ సమాధానం ఇవ్వడం, మ్యూజిక్ మార్చడం వంటివి సులభంగా చేయవచ్చు.

Snapdragon 8 Gen 3 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్: ఇది ప్రస్తుతం మార్కెట్‌లోని అత్యంత శక్తిమంతమైన చిప్‌సెట్‌లలో ఒకటి. హై-ఎండ్ గేమింగ్ నుంచి మల్టీటాస్కింగ్ వరకు ప్రతీదీ మెరుపు వేగంతో పనిచేస్తుంది.

50MP ప్రధాన కెమెరా: చాలా క్వాలిటీతో ఫొటోలను తీస్తుంది

AI ఫీచర్లు: ఇందులో ఉన్న “Auto Zoom” వంటి ఫీచర్లు, మీరు కదులుతున్నా సబ్జెక్ట్‌ను ఎప్పుడూ ఫ్రేమ్‌లో ఉంచుతాయి. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌లా ఫొటోలు తీయవచ్చు.

4000mAh బ్యాటరీ: 25W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

ఈ డీల్ ఎవరికి నచ్చుతుంది?

ఎప్పటినుంచో ఒక ఫోల్డబుల్ ఫోన్ కొనాలని కలలు కనేవారికి..
ఫ్యాషన్, స్టైల్, టెక్నాలజీని ఇష్టపడేవారికి..
ఒక కాంపాక్ట్, కానీ శక్తిమంతమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తున్నవారికి..
రూ.70,000 బడ్జెట్‌లో ఒక యూనిక్, ప్రీమియం డివైస్ కావాలనుకునేవారికి..