×
Ad

Samsung Galaxy Z Flip 7 FE : అమెజాన్‌లో అద్భుతమైన డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌ ఇంత తక్కువా? ధర ఎంతో తెలిస్తే ఎగబడి కొనేస్తారు..

Samsung Galaxy Z Flip 7 FE : శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ ఫోన్ సరసమైన ధరకే లభిస్తోంది. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు.

Samsung Galaxy Z Flip 7 FE

Samsung Galaxy Z Flip 7 FE : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఇటీవలే శాంసంగ్ నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసింది. కంపెనీ ఫస్ట్ ఫ్యాన్ ఎడిషన్ ఫోల్డబుల్ ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 ఎఫ్ఈ ఒకటి. ఈ మడతబెట్టే శాంసంగ్ ఫోన్ (Samsung Galaxy Z Flip 7 FE) ధర భారీగా తగ్గింది. మీరు కూడా ఫోల్డబుల్ ఫోన్లను ఇష్టపడితే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE కొనుగోలుదారులు అమెజాన్‌లో రూ. 16వేల వరకు భారీ తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ ఫోల్డబుల్‌ ఫోన్ అసలు లాంచ్ ధర కన్నా అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీరు ఎంత తొందరగా కొనేసుకుంటే అంత మంచిది.. ఇంతకీ ఈ కిర్రాక్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Motorola Edge 50 Fusion : మైండ్ బ్లోయింగ్ ఆఫర్ బ్రో.. అతి చౌకైన ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE అమెజాన్ డీల్ :
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 ఎఫ్ఈ (8GB + 256GB వేరియంట్) భారత మార్కెట్లో రూ.95,999కు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ మోడల్ ప్రస్తుతం రూ.89,999కు లిస్ట్ అయింది. రూ.6వేలు ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసేటప్పుడు రూ.10వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 ఎఫ్ఈ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ మెయిన్ డిస్‌ప్లే, 3.4-అంగుళాల సూపర్ అమోల్డ్ కవర్ స్క్రీన్‌ కలిగి ఉంది. హుడ్ కింద, ఫోన్ ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజీతో వస్తుంది.

4,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 FEలో 50MP వైడ్ లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP కెమెరా కలిగి ఉంది.