Samsung Galaxy Z Fold 8 Ultra : ఏంది భయ్యా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్ మరి ఇంత తక్కువా..!

Samsung Galaxy Z Fold 8 Ultra : శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా ఫోన్ అతి సరసమైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ద్వారా ఒకేసారి రూ. 11వేలు తగ్గింపుతో మడతబెట్టే ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు.

  • Published on- September 21, 2026 / 06:21 PM IST

Samsung Galaxy Z Fold 8 Ultra

  • శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా అసలు ధర రూ. 1,99,999
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోల్డబుల్‌ను కొంటే రూ. 11వేలు ఆదా
  • HDFC, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 7వేలు తగ్గింపు

Samsung Galaxy Z Fold 8 Ultra : శాంసంగ్ లవర్స్ తప్పక కొనాల్సిన ఫోన్.. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ కొనాలని అనుకునేవారికి అదిరిపోయే ఆఫర్.. గత నెలలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా జెడ్ ఫ్లిప్ 8తో సహా లేటెస్ట్ ఫోల్డబుల్ డివైజ్‌లను లాంచ్ చేసింది. మీరు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్..

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోల్డబుల్‌పై అద్భుతమైన డీల్‌ను అందిస్తోంది. తద్వారా రూ. 11వేల వరకు ఆదా చేయొచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఈ ఆఫర్ ఫోన్ ముఖ్యమైన స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా డీల్ :
శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా అధికారిక ధర రూ. 1,99,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోల్డబుల్ ఫోన్ కొంటే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్/ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 11వేలు ఆదా చేయొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 7వేలు తగ్గింపు పొందవచ్చు. మరింత ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కూడా ఎక్స్చేంజ్ చేయవచ్చు.

Read Also : Vivo X300 Pro : అమెజాన్ సూపర్ ఆఫర్ భయ్యా.. ఈ వివో ఫోన్ ఇంత తక్కువకు మళ్లీ దొరకదు.. ఎంత తగ్గిందో తెలుసా?

అల్ట్రా స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రాలో 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 8.0-అంగుళాల 2x అమోల్డ్ మెయిన్ డిస్‌ప్లే ఉంది. దాంతో పాటు ఈ ఫోల్డబుల్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల FHD+ డైనమిక్ 2X అమోల్డ్ డిస్‌ప్లే కూడా ఉంది. జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా లోపల క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh డ్యూయల్ బ్యాటరీ సపోర్టు ఇస్తుంది.

కెమెరా ప్రియుల కోసం ఈ ఫోల్డబుల్ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ కవర్ డిస్‌ప్లే కింద 10MP కెమెరా, మెయిన్ డిస్‌ప్లే కింద 10MP సెన్సార్ ఉన్నాయి.