Samsung Triple Foldable : ఆపిల్ ఇక కాస్కో.. ఐఫోన్ ఫోల్డ్‌కు పోటీగా శాంసంగ్ 3 కొత్త ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్లు.. ఫీచర్లపై భారీ అంచనాలు!
Samsung Triple Foldable : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి బిగ్ న్యూస్.. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ ఫోల్డ్‌కు పోటీగా సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ జెడ్ వైడ్ ఫోల్డ్‌ను లాంచ్ చేయనుంది.. పూర్తి వివరాలివే
- Sreehari A
- Published On : April 12, 2026 / 07:43 PM IST
Samsung Triple Foldable
- ఐఫోన్ ఫోల్డ్‌కు పోటీగా గెలాక్సీ జెడ్ వైడ్ ఫోల్డ్ లాంచ్
- వచ్చే జూలై 22న లండన్‌లో శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్
- గెలాక్సీ Z ఫోల్డ్ 8తో పాటు మరో 2 మోడళ్లు రిలీజ్ చేయొచ్చు
Samsung Triple Foldable : శాంసంగ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. శాంసంగ్ మడతబెట్టే ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఒకటి కాదు.. ఏకంగా మూడు కొత్త ఫోల్డబుల్ ఫోన్లు రానున్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్లతో శాంసంగ్ అతి త్వరలోనే మార్కెట్లో సంచలనం సృష్టించనుంది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8తో పాటు మరో 2 మోడళ్లను రిలీజ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. ఈ రెండు మోడళ్లు కూడా ఫోల్డబుల్ ఫోన్లేనని అంచనా. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8తో పాటు ఆ కంపెనీ గెలాక్సీ Z ఫ్లిప్ 8, గెలాక్సీ Z వైడ్ ఫోల్డ్‌లను కూడా రిలీజ్ చేయొచ్చు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
శాంసంగ్ నుంచి మొత్తం 3 కొత్త ఫోల్డబుల్ ఫోన్లు రానున్నాయి. కంపెనీ 2026లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 , గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8, గెలాక్సీ జెడ్ వైడ్ ఫోల్డ్ పేరుతో మడతబెట్టే ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ 3 ఫోన్ల డిజైన్లు ముందుగానే లీక్ అయ్యాయి.
ఇందులో ఫోల్డబుల్ ఫోన్ ఆపిల్ ఐఫోన్ ఫోల్డ్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. కంపెనీ గెలాక్సీ జెడ్ వైడ్ ఫోల్డ్, ఐఫోన్ ఫోల్డ్‌ను సెప్టెంబర్‌లో లాంచ్ చేయవచ్చు. ఈ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
శాంసంగ్ కొత్త ఫోన్ లాంచ్ అతి త్వరలోనే జరగనుంది. ఈ వేసవిలో జరగబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించవచ్చని సమాచారం. కొరియా లీకుల ప్రకారం.. కంపెనీ లాంచ్ ఈవెంట్ కోసం తేదీ, లొకేషన్ రెండింటినీ ఖరారు చేసింది. ఈ ఈవెంట్ లండన్‌లో జూలై 22 బుధవారం జరగనుంది. కంపెనీ దీనిపై ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 డిజైన్‌లో ఎలాంటి కీలక మార్పులు లేవు. పాత గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 మాదిరిగానే డిజైన్‌తో వస్తుందని అంచనా. మరోవైపు, శాంసంగ్ గెలాక్సీ జెడ్ వైడ్ ఫోల్డ్‌లో కొత్తగా ఉండవచ్చు.
ఈ ఫోన్‌లో 7.6-అంగుళాల మెయిన్ డిస్‌ప్లే ఉండవచ్చు. 4:3 యాస్పెక్ట్ రేషియోతో అమోల్డ్ ప్యానెల్ అవుతుంది. కవర్ డిస్‌ప్లే 5.4 అంగుళాలు ఉంటుంది. 0.39 అంగుళాల మందంతో ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో రానుంది. డ్యూయల్ కెమెరా సెటప్‌తో రావచ్చు. కంపెనీ ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.
