స్మార్ట్ ఫోన్‌కు అలవాటు పడినా, డ్రగ్స్ తీసుకున్నా బ్రెయిన్‌పై సేమ్ ఎఫెక్ట్!

  • Publish Date - April 28, 2020 / 09:14 AM IST

స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడటం కాదు.. వ్యసనమైపోతుంది. టీనేజర్లలో ఈ ఎఫెక్ట్ మరింతగా ఉంటుంది. సోషల్ మీడియా పుణ్యమా అని యాక్టింగ్ టాలెంట్, సింగింగ్ టాలెంట్‌తో పోస్టులు పెట్టేసి వాటికి వచ్చే లైకులు, షేర్లు కోసం వాటినే పట్టుకుని కూర్చొంటున్నారు. వయస్సుతో పరిమితం లేకుండా టిక్ టాక్‌లు, పబ్జీలు మనిషి అలవాట్లను శాసిస్తున్నాయి. 

అడిక్టివ్ బిహేవియర్‌పై ఓ ప్రత్యేక కథనం రాసిన జర్మన్లు కీలక విషయాలను బయటపెట్టారు. హీడెల్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన 48మంది వ్యక్తులపై ఎమ్మారై స్కానింగ్ టెస్టులు చేశారు. వారిలో 22మంది స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్(బానిస) అయిపోయిన వారు. 26మందికి స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండేవారు. ఆ టెస్టుల్లో వచ్చిన ఫలితాలను చూసి షాక్ అయ్యారు. స్మార్ట్ ఫోన్ వాడేవారు నేరుగా కళ్లతో ఫోన్లను చూడడం వల్ల వారి బ్రెయిన్‌లో మార్పులు వచ్చాయట.

 

గ్రే రంగులో ఉండే భాగంలో ఎఫెక్ట్ అయి తగ్గిపోయిందట. దీంతో మెదడు మధ్యలోని కండరాలు అదుపు కోల్పోతున్నాయి. మాటలు, కంటిచూపు, వినికిడి, మానసిక ఆరోగ్యం పైనా ప్రభావం చూపిస్తున్నాయి. మెదడు మధ్య భాగంలోనే ఎమోషన్స్ అదుపుచేసే గ్రంథులు ఉంటాయి. ఎడమ వైపున ఉన్న ఇన్సులా ఎమోషన్స్ కు బాధ్యత వహిస్తుంది.

అంతేకా ఎమోషన్స్, వస్తువులను గుర్తు పట్టడం, మెమోరీ ప్రొసెసింగ్ కు కీలకంగా వ్యవహరిస్తుంది. యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వారు కొకైన్ లాంటి డ్రగ్స్ తాగిన వారిలోనూ ఇవే లక్షణాలు కనిపించాయి. స్మార్ట్ ఫోన్‌ బానిసలకు డొపమైన్ అనే పదార్థం విడుదలై మెదడులోని మధ్య భాగాన్ని పని చేయనివ్వకుండా చేస్తుంది.