Ai+ Phone Prices : కొత్త AI ఫోన్ కావాలా? ఈ Ai ఫోన్లు చాలా కాస్ట్లీ గురూ.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?
Ai+ Phone Prices : ఏఐ ప్లస్ ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. భారత మార్కెట్లో ఈ ఏఐ ప్లస్ మోడల్ ఫోన్లు కొనాలంటే అదనంగా ఎక్కువగా ఖర్చు చేయాల్సిందే.. ఇంతకీ ఏయే వేరియంట్ల ధరలు ఎంత పెరిగాయో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- August 21, 2026 / 03:44 PM IST
Ai+ Phone Prices
- ఏఐ ప్లస్ పల్స్ 2 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999
- ఏఐ ప్లస్ నోవా 2 5జీ 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999
- ఏఐ ప్లస్ నోవా 2 నియో 5జీ 4GB+64GB వేరియంట్ ధర రూ. 14,999
Ai+ Phone Prices : కొత్త ఏఐ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఏఐ ప్లస్ స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. భారత మార్కెట్లో ఈ కంపెనీ అన్ని వేరియంట్ల ధరలను పెంచింది. మీరు కొత్త ఏఐ+ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తుంటే మీరు రూ. 2వేల వరకు అదనంగా పేమెంట్ చేయాలి.
మెమరీ, తయారీ, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో ఈ బ్రాండ్ ఫోన్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. దీని కారణంగా అనేక ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులు కూడా తమ ఫోన్ల ధరలను పెంచారు. ఏఐ పల్స్ 2, నోవా 2 5జీ, నోవా 2 నియో 5జీ, నోవా 2 ప్రో 5జీ, నోవా 2 అల్ట్రా 5జీ వంటి ఎంట్రీ-లెవల్ మిడ్-రేంజ్ కేటగిరీ స్మార్ట్‌ఫోన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఏఐ ప్లస్ పల్స్ 2 ధర :
ఈ ఏఐ ప్లస్ పల్స్ 2 ఫోన్ 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999 నుంచి రూ.10,999కు, అంటే రూ. 1,000 పెరిగింది. అలాగే, 4GB+128GB స్టోరేజ్ వేరియంట్ (Ai+ Phone Prices) ధర రూ. 10,999 నుంచి రూ.11,499కు అంటే రూ. 500 పెరిగింది. ఈ ఫోన్ ధర రూ. 500 నుంచి రూ.1,000 వరకు పెరిగింది.
ఏఐ ప్లస్ నోవా 2 :
ఈ ఏఐ ప్లస్ నోవా 2 5జీ ధర రూ. 1,000 పెరిగింది. 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999 నుంచి రూ. 13,999కి, 4GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999 నుంచి రూ. 14,999కి, 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999 నుంచి రూ.15,999కి పెరిగింది. మొత్తం మీద ఈ ఫోన్ ధర రూ. 1,000 పెరిగింది.
ఏఐ నియో నోవా 2 :
ఈ నియో 5జీ ఫోన్ 4GB+64GB వేరియంట్ ధర రూ. 13,999 నుంచి రూ. 14,999కి పెరిగింది. అలాగే, 4GB+128GB వేరియంట్ ధర రూ. 14,999 నుంచి రూ.15,999కి, 6GB+128GB వేరియంట్ ధర రూ. 15,999 నుంచి రూ.16,999కి పెరిగింది. ఈ ఫోన్ ధర మొత్తంగా ఒక్కో వేరియంట్ రూ. 1,000 పెరిగింది.
ఏఐ ప్లస్ :
ఏఐ ప్లస్ నోవా 2 ప్రో 5జీ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 2వేలు (ధర రూ. 15,999 నుంచి రూ.17,999)కు పెరిగింది. అలాగే, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999 నుంచి రూ.19,999కు పెరిగింది. ఈ మోడళ్లపై మొత్తం రూ. 2వేలు పెరిగింది.
ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా :
ఈ 5జీ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 2వేలు (రూ. 18,999 నుంచి రూ.20,999)కు పెరిగింది. అలాగే, ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 2వేలు (రూ. 20,999 నుంచి రూ. 22,999)కు పెరిగింది.
