Redmi K100 Pro Max : రెడ్‌మి K100 ప్రో మ్యాక్స్ దూసుకొస్తోంది.. లాంచ్‌కు ముందే సీక్రెట్ ఫీచర్లు లీక్..!
Redmi K100 Pro Max : రెడ్‌మి నుంచి K100 ప్రో మ్యాక్స్ రాబోతుంది. అదిరిపోయే కెమెరా ఫీచర్లతో పవర్‌ఫుల్ చిప్‌సెట్ అందించనుంది. వచ్చే సెప్టెంబర్ నెలలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- Sreehari A
- Published on- May 15, 2026 / 07:47 PM IST
Redmi K100 Pro Max ( Image Credit : AI )
- షావోమీ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే అదిరే కెమెరా ఆప్షన్లు
- రెడ్‌మి K100 స్మార్ట్‌ఫోన్ సిరీస్ సెప్టెంబర్‌లో లాంచ్ కావచ్చు
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 సిరీస్ చిప్‌సెట్
Redmi K100 Pro Max : రెడ్‌మి లవర్స్ మీకోసమే.. రెడ్‌మి K100 సిరీస్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కంపెనీ రెడ్‌మి K100 సిరీస్‌ను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. ఇతర షావోమీ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే ఈ సిరీస్ కూడా అద్భుతమైన కెమెరా పర్ఫార్మెన్స్ అందిస్తుందని అంచనా.
అంతేకాదు.. ఈ సిరీస్‌లో క్వాల్‌కామ్ అత్యంత పవర్‌ఫుల్ సరికొత్త చిప్‌సెట్ అందించనుంది. రెడ్‌మి K100 సిరీస్ కీలక ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రెడ్‌మి K100 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రెడ్‌మి K100 సిరీస్ పోస్ట్‌ను షేర్ చేసింది.
కంపెనీ రాబోయే రెడ్‌మి K100 స్మార్ట్‌ఫోన్ సిరీస్ సెప్టెంబర్‌లో లాంచ్ కావచ్చని అంచనా. ఈ సిరీస్‌లో అత్యంత పవర్‌ఫుల్ మోడల్ రెడ్‌మి K100 ప్రో మ్యాక్స్ కూడా ఉంది. క్వాల్‌కామ్ పవర్‌ఫుల్ చిప్‌సెట్ ఉంటుంది.
షావోమీ 18 సిరీస్ లాంచ్ ఛాన్స్ :
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో చిప్‌సెట్ అమర్చవచ్చు. వచ్చే సెప్టెంబర్‌లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. అలాగే, కంపెనీ షావోమీ 18 సిరీస్‌ను కూడా రిలీజ్ చేస్తుందని అంచనా. రెడ్‌మి K100 సిరీస్ ముందుగా లాంచ్ కావచ్చని టిప్‌స్టర్ అంచనా వేశారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 2 మోడళ్లు మాత్రమే రిపోర్టు అయ్యాయి.
ఇందులో రెడ్‌మి K100 రెడ్‌మి K100 ప్రో మాక్స్ ఉండవచ్చు. రెడ్‌మి K100లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ ఉంటుందని అంచనా వేయగా, రెడ్‌మి K100 ప్రో మాక్స్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 సిరీస్ చిప్‌సెట్ ఉండవచ్చు.
ఈ సిరీస్‌లో మూడో మోడల్ కూడా రానుందని అంచనా. అయితే ఈ ఫోన్ పేరు ఇంకా ఖరారు కాలేదు. ఈ సిరీస్‌లో కంపెనీ రెడ్‌మి K100 ప్రోను కూడా లాంచ్ చేయొచ్చు. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో కంపెనీ రెడ్‌మి టర్బో 6 సిరీస్‌ను కూడా లాంచ్ చేయవచ్చు. మొత్తం మీద, ఈ ఏడాది చివరి నాటికి షావోమీ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది.
