Tata Motors: టాటామోటార్స్ నుంచి గుడ్ న్యూస్..

కరోనా వైరస్ దేశం మొత్తాన్ని వణికిస్తోంది.. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. పలు చోట్ల అత్యవసర సర్వీసులు మినహాయించి ఇతర సర్వీసులు ఓపెన్ చేయడం లేదు.

Tata Motors: కరోనా వైరస్ దేశం మొత్తాన్ని వణికిస్తోంది.. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. పలు చోట్ల అత్యవసర సర్వీసులు మినహాయించి ఇతర సర్వీసులు ఓపెన్ చేయడం లేదు. ఈ క్రమంలో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సంస్థ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

మే 31 వరకూ మాత్రమే ఉన్న వాహనాల వారెంటీ, ఫ్రీ సర్వీస్ వ్యాలిడిటీ గడువును జూన్​ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సదుపాయాన్ని ప్రకటించినట్లు చేసింది. టాటా మోటార్స్ ప్రకటన ప్రకారం.. 2021 ఏప్రిల్ 31 నుంచి 2021 మే 31 మధ్య కాలంలో ముగియబోయే ప్రయాణీకుల కార్ల వారెంటీ, ఫ్రీ సర్వీసుల వ్యాలిడిటీని 2021 జూన్ 30 వరకు పొడిగించింది.

కోవిడ్ -19 లాక్‌డౌన్ కారణంగా వినియోగదారులు వాహనాలను నిర్వహణ, మరమ్మతుల కోసం టాటా మోటార్స్ సేవా కేంద్రాలకు తీసుకురాలేరు. లాక్ డౌన్ సమయంలో వారంటీ, ఫ్రీ సర్వీసుల వ్యాలిడిటీ ముగిస్తే మాకు పెద్ద సవాల్‌గా మారుతుందని చెప్పారు.

మెహతా మాట్లాడుతూ.. ‘మా కస్టమర్లకు ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉన్నాం. వారి వారంటీ, ఫ్రీ సర్వీసుల వ్యవధిని 2021 జూన్ 30 వరకు పొడిగించడం ద్వారా ఈ కఠినమైన సమయాల్లో ఈ మాత్రమైనా మద్దతు ఇస్తున్నాం’ అని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ సంస్థకి 400కి పైగా ప్రాంతాల్లో 608 సర్వీస్​ సెంటర్లు నిర్వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు